Site icon NTV Telugu

Mobile Camera Cleaning: స్మార్ట్ ఫోన్ మొబైల్ కెమెరా క్లీన్ చేయడం లేదా.. ఇక అంతే..!

Mobile Cleaning

Mobile Cleaning

Mobile Camera Cleaning: ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యమైన కెమెరాలు కలిగిన అనేక స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ముందుగా 200 మెగా పిక్సెల్ కెమెరాతో Realme 11 Pro+ ఇండియాలో ప్రారంభించారు. అయితే ఎక్కువగా ఫోటోగ్రఫీని(Photography) ఇష్టపడే వారు ఎక్కువ మెగా పిక్సెల్(Mega Pixel) కెపాసిటీ ఉన్న ఫోన్‌ని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు బీభత్సంగా అమ్ముడవుతున్నాయి. అయితే ఈ ఫోన్ కెమెరాను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటప్పుడే ఫోన్ తో మీరు మంచి ఫొటోలను తీయగలరు. అంతేకాకుండా ఫొటో క్లారిటీగా వస్తుంది. అయితే చాలా మంది ఫోన్ కెమెరాను శుభ్రం చేయకుండానే ఫొటోలు తీయడం లాంటివి చేస్తారు. అలా చేయడం వల్ల కెమెరాలో దుమ్ము, ధూలి ఉండటం వల్ల లెన్స్ పోయే అవకాశం ఉంది. అందువలన మీరు మీ ఫోన్ ను క్లీన్ చేసుకోవాలి. అందుకు సంబంధించి మీరు ఇంట్లో సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.

Read Also: WeWantJusticeForShyamNTR: శ్యామ్ మృతిపై స్పందించిన పోలీసులు.. ఏమన్నారంటే..?

కెమెరాను శుభ్రంగా ఉంచుకోవాలంటే.. మీ స్మార్ట్ ఫోన్ ను ఇంట్లో లేదా ఆఫీసులో శుభ్రమైన ప్రదేశంలో పెట్టాలి. దుమ్ము, మురికి ఉండే ప్రదేశంలో పెట్టకూడదు. ఇలా చేస్తే ఫోన్ కెమెరాను శుభ్రంగా ఉండేలా చూసుకోవచ్చు. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ కెమెరాను శుభ్రపరిచేటప్పుడు ఫోన్‌ను స్విచ్ ఆఫ్(Switch off) చేయండి. క్లీన్ చేయడానికి మృదువైన మైక్రోఫైబర్ వస్త్రం(Micro fiber cloth) ఉపయోగించాలి.. కఠినమైన క్లాత్ తో కెమెరాను శుభ్రం చేయవద్దు. ఇది కెమెరా గ్లాస్‌పై మరకలను కలిగిస్తుంది.

Read Also: Surendra Reddy : ఆ మెగా హీరోతో సినిమా చేయబోతున్న సురేంద్ర రెడ్డి..?

అంతేకాకుండా లెన్స్ క్లీనర్‌ను(Lens cleaner) కూడా ఉపయోగించవచ్చు. దీని ద్వారా కెమెరా, ఎల్ఈడీ లైట్లు(LED Light), సెన్సార్లను శుభ్రం చేయవచ్చు. దీంతో ఫోటో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ లెన్స్ క్లీనర్‌ను ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. కెమెరాకు నేరుగా లెన్స్ క్లీనర్‌ను ఎప్పుడూ అప్లై చేయకూడదు. అది కెమెరా, ఫోన్‌కు హాని కలిగించవచ్చు. అంతేకాకుండా కెమెరాను క్లీన్ చేసేటప్పుడు చేతులతో ఎక్కువ ఒత్తిడి చేయవద్దు. అంతేకాకుండా క్లీన్ చేసేంత సంబంధించే నీటిని వాడాలి. లేదంటే ఫోన్‌లోకి నీరు చేరితే మదర్‌బోర్డు పాడయ్యే అవకాశం ఉంది. అలాగే కెమెరాను తడి క్లాత్ తో శుభ్రం చేయవద్దు.
హార్డ్ బ్రష్‌తో కెమెరాను శుభ్రం చేయవద్దు. చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ను శుభ్రం చేయడానికి బ్రష్‌ను ఉపయోగిస్తారు. అది మెత్తగా ఉంటే సమస్య లేదు. కానీ రఫ్ గా ఉంటే మాత్రం కెమెరా పాడయ్యే అవకాశం ఉది.

Exit mobile version