Cheapest Saree Markets: మగువలకు గుడ్ న్యూస్.. రూ.150 కే పట్టు చీరలు.. దేశంలోనే అత్యంత చౌకైన మార్కెట్లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cheapest Saree Markets: ఫంక్షన్ ఏదైనా, పండుగ వచ్చినా మహిళలు ముందుగా వెతికేది అందమైన చీరల కోసమే. అయితే అద్భుతమైన డిజైన్లతో పాటు బడ్జెట్‌లోనే అదిరిపోయే చీరలు దొరికితే ఆ ఆనందమే వేరు. భారతదేశంలో కేవలం రూ.150 నుంచే నాణ్యమైన పట్టు చీరలు లభించే మూడు ప్రసిద్ధ మార్కెట్ల గురించి మీకు తెలుసా? ఢిల్లీ, కోల్‌కతా, ముంబై నగరాల్లోని ఈ మార్కెట్లు హోల్‌సేల్ ధరకు చీరలను విక్రయిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. వాటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. చాందీనీ చౌక్ (ఢిల్లీ).. డిజైనర్ చీరల అడ్డా
ఢిల్లీలోని చాందీనీ చౌక్ అంటే కేవలం రుచికరమైన ఆహారమే కాదు, వస్త్ర ప్రపంచానికి పెట్టింది పేరు. ఇక్కడ బనారసి, పట్టు, కాటన్ నుంచి లేటెస్ట్ డిజైనర్ చీరల వరకు అన్నీ లభిస్తాయి. ఇక్కడ ధర రూ.500 నుంచి ప్రారంభం అవుతుంది. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే.. పెళ్లిళ్లు, పార్టీలకు కావాల్సిన రిచ్ లుక్ చీరలు ఇక్కడ చాలా ఫేమస్. చాందీనీ చౌక్ ఓపెనింగ్ టైం విషయానికి వస్తే.. ఉదయం 10:00 నుంచి రాత్రి 9:00 వరకు (ఆదివారం సెలవు). ఈ ప్లే్స్‌కు ఎలా వెళ్లాలంటే.. చాందీనీ చౌక్ మెట్రో స్టేషన్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
Also Read
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
2. బుర్రా బజార్ (కోల్‌కతా).. బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్
మీరు తక్కువ ధరలో ఎక్కువ కలెక్షన్‌ను చూడాలనుకుంటే కోల్‌కతాలోని బుర్రా బజార్ సరైన ప్లేస్. ఇక్కడ వందలాది దుకాణాలు హోల్‌సేల్ ధరలకే చీరలను విక్రయిస్తాయి. వీటి ధర విషయానికి వస్తే.. ధర రూ.150 నుంచి రూ.3,000 వరకు ఉంటుంది. ఈ ప్లేస్ ప్రత్యేకత విషయానికి వస్తే కాటన్, హ్యాండ్లూమ్, బంధాని, సింథటిక్ చీరలకు ఇది చాలా ఫేమస్. బుర్రా బజార్ ఓపెనింగ్ టైం విషయానికి వస్తే.. ఉదయం 10:00 నుంచి రాత్రి 9:00 వరకు (ఆదివారం సెలవు). దీనికి ఎలా వెళ్లాలంటే.. మహాత్మా గాంధీ రోడ్ మెట్రో స్టేషన్ ఇక్కడికి చాలా దగ్గర.
3. మంగళ్‌దాస్ మార్కెట్ (ముంబై) .. లేటెస్ట్ డిజైన్ల అడ్డా
ముంబైలోని మంగళ్‌దాస్ మార్కెట్ నిత్యం కొత్త డిజైన్లతో కళకళలాడుతుంటుంది. ఇక్కడికి వెళ్తే ఒకే సందులో 20 నుంచి 30 రకాల విభిన్నమైన మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి. దీని ప్రత్యేకత విషయానికి వస్తే.. జార్జెట్, ప్రింటెడ్, ఆఫీస్ వేర్ చీరలు ఇక్కడ వెరైటీగా లభిస్తాయి. ఓపెనింగ్ టైం విషయానికి వస్తే.. ఉదయం 11:00 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆదివారం సెలవు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. అప్-టు-డేట్ ఫ్యాషన్ కోరుకునే వారికి ఈ మార్కెట్ నిరాశ పరచదు.
చాలా మందికి వచ్చే సహజమైన ప్రశ్న.. ఈ మార్కెట్లలలో చీరలు తక్కువ ధరకే దొరుకుతాయా అని?.. అవును ఈ హోల్‌సేల్ మార్కెట్లలో రూ.150 – రూ.300 మధ్య రోజువారీ వాడకానికి సరిపోయే మంచి చీరలు లభిస్తాయి. వీటిలో బెస్ట్ మార్కెట్ ఏదంటే.. హోల్‌సేల్ వ్యాపారానికి కోల్‌కతాలోని బుర్రా బజార్, ముంబైలోని మంగళ్‌దాస్ మార్కెట్ అత్యంత అనువైనవి. తక్కువ ధరలో మంచి నాణ్యత కావాలంటే కళ్లు మూసుకుని చాందీనీ చౌక్ వెళ్లవచ్చు. తక్కువ ఖర్చుతో మీ వార్డ్‌రోబ్‌ను అద్భుతమైన చీరలతో నింపేయాలనుకుంటే, ఈసారి ఆ నగరాలకు వెళ్ళినప్పుడు ఈ మార్కెట్లను సందర్శించడం మర్చిపోకండి..
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!