ఈమధ్య కాలంలో జనాలకు ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది.. దానివల్ల రకారాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో ఒకటి బ్రౌన్ రైస్ ను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు.. బరువును సులువుగా తగ్గుతారాని డైట్ భాగం చేసుకున్నారు..పొట్టు తీయని ఈ బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే చాలా ఆరోగ్యకరమైనది మరియు దీనిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బ్రౌన్ రైస్ ను రోజూ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్ లో క్యాల్షియం, సెలీనియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫోలేట్, బి కాంప్లెక్స్ విటమిన్స్ , ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. ఇక ఈ బ్రౌన్ రైస్ వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
అధిక బరవు సమస్యతో బాధపడే వారు బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. చాలా సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. మన ధ్యాస ఇతర చిరుతిళ్లకు మీదకు వెళ్లకుండా ఉంటుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.. బరువును సులువుగా తగ్గిస్తుంది.. అలాగే షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.. షుగర్ కంట్రోల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..
బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల ఉబ్బరం, అతిసారం, మలబద్దకం వంటి సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కనుక ఇటువంటి సమస్యలతో బాధపడే వారు రోజూ బ్రౌన్ రైస్ ను తీసుకోకపోవడమే మంచిది. అలాగే వైట్ రైస్ లో కంటే బ్రౌన్ రైస్ లో ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటుంది. ఆర్సెనిక్ ఎక్కువగా ఉండే ఈ బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, టైస్ 2 డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.. అందుకే బ్రౌన్ రైస్ ను తీసుకోనేవారు వీటిని బాగా కడిగి, గంజిని వార్చాలి.. అప్పుడే ఈ రైస్ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..