ట్రెండ్ మారే కొద్ది ప్రతి ఒక్కరికి అందం మీద ఆసక్తి కూడా పెరిగింది.. దాంతో అందరు అందంగా కనిపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు..అయితే అందంగా కనిపించేందుకు పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడం తప్పనిసరి. వీటి వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి. ఇక అలాంటి ఆహారాల విషయానికి వస్తే.. మనకు కొన్ని రకాల జ్యూస్‌లు అందుకు ఎంతగానో తోడ్పడుతాయి. కింద చెప్పిన జ్యూస్‌లలో ఏదైనా ఒక్క దాన్ని రోజూ తాగితే చాలు.. నెల రోజుల్లో మార్పును చూడవచ్చు.. ఆ జ్యూస్ ను ఎలా తయారు చెయ్యాలి, ఎలా తీసుకోవాలో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం..
మాములుగా ఫ్రెష్ కూరగాయలు ఆకు కూరలు వాడితే మనుషులు ఆరోగ్యంగా ఉంటారన్ని విషయం తెలిసిందే..పాలకూర, కీరదోస, గ్రీన్ యాపిల్, నిమ్మకాయ, అల్లం. వీటిని కలిపి జ్యూస్‌ను తయారు చేసి రోజుకు ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కీరదోస చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది. నిమ్మరసం, అల్లం రసం చర్మంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతాయి.. దాంతో చర్మం అందంగా, చాలా యవ్వనంగా ఉంటుంది..
ఇకపోతే బీట్‌రూట్, బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలతో జ్యూస్‌ను తయారు చేసి అందులో నిమ్మరసం కలిపి తాగవచ్చు. ఈ జ్యూస్ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మంలో రక్త సరఫరాను పెంచుతుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే పుచ్చకాయ, పుదీనా ఆకుల జ్యూస్ లేదా పైనాపిల్, కీరదోస కలిపి జ్యూస్ చేసి కూడా తాగవచ్చు. ఇలా ఈ జ్యూస్‌లలో ఏదైనా ఒక్కదాన్ని రోజూ తాగడం వల్ల నెల రోజుల్లోనే చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది.. చర్మం కాంతి వంతంగా నిగ నిగలాడుతూ నిత్య యవ్వనంగా ఉంటారు..
ఇంకో జ్యూస్..క్యారెట్లు, నారింజలు, కాస్త పసుపు వేసి జ్యూస్ తయారు చేసి తాగవచ్చు. క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది చర్మాన్ని సంరక్షించి కాంతిని అందిస్తుంది. అలాగే నారింజల్లో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం ముడతలు పడకుండా చూస్తుంది. ఇక పసుపు చర్మ రోగాలను రాకుండా చేస్తుంది.. అంతేకాదు.. చర్మానికి నిగారింపును ఇస్తుంది.. ఈ జ్యూస్ లలో ఏదైనా సరే రోజూ తీసుకుంటే యవ్వనంగా అందంగా కనిపిస్తారు..