వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువగానే ఉంటుంది.. ఎన్ని రకాల మందులు వాడిన కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు.. జుట్టు కుదుళ్లకు పోషకాలు సరిగ్గా అందక అవి బలహీనపడి జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. జుట్టును రాలడాన్ని తగ్గించుకోవడానికి మనలో చాలా మంది బటయ మార్కెట్ లో లభించే నూనెలను, యాంటీ హెయిర్ ఫాల్ షాంపులను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఎటువంటి ఫలితం లేక తీవ్ర నిరాశకు గురి అవుతూ ఉంటారు. జుట్టు రాలూ సమస్యతో బాధపడుతున్నారు వీటికి బదులుగా సహజంగా లభించే కలబందను వాడితే జుట్టు సమస్యల నుంచి బయటపడవచ్చు.. అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా ఒక గిన్నెలో నూనె తీసుకొని, దాన్ని వేడిగా అయ్యేవరకు వేడి చెయ్యాలి.. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జును తీసుకొని బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న నూనెన రాత్రి పడుకునే ముందు జుట్టుకు బాగా పట్టించాలి. నూనె కుదుళ్లల్లోకి ఇంకేలా మర్దనా చేయాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.. అలాగే కలబంద గుజ్జును తీసుకోవాలి. తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసాన్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి..
అంతే కాదు కలబంద గుజ్జును నేరుగా జుట్టుకు రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.. అయితే, జుట్టును చిక్కులు లేకుండా బాగా దువ్వాలి. తరువాత కలబంద గుజ్జును నేరుగా జుట్టుకుదుళ్లపై రాసి మర్దనా చేయాలి. ఒక గంట తరువాత షాంపుతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు రాలడం తగ్గుతుంది… ఇలా చెయ్యడం వల్ల జుట్టు ఒత్తుగా, అందంగా మెరుస్తూ ఉంటుంది.. చుండ్రు సమస్యలు కూడా తగ్గిపోతాయి.. మీరు కూడా ట్రై చెయ్యండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.