Antibiotics Misuse: జ్వరం, దగ్గు, జలుబుకు యాంటీబయోటిక్స్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Antibiotics for Fever and Cold: జ్వరం, దగ్గు, గొంతు గరగర, జలుబు వచ్చినప్పుడు చాలామంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా యాంటీబయోటిక్స్ (antibiotics) వాడేస్తుంటారు. కొందరు పాత ప్రిస్క్రిప్షన్ (old prescription) చూసి మందులు వేసుకుంటే, మరికొందరు నేరుగా మెడికల్ షాప్‌కి వెళ్లి సొంతంగా కొనుక్కుని తింటుంటారు. ఇలా చేయడం వల్ల జబ్బు త్వరగా నయమవుతుందని అనుకుంటారు కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రతి జ్వరం (fever), దగ్గు (cough) లేదా గొంతు నొప్పి (sore throat) కి యాంటీబయోటిక్స్ వాడటం మన శరీరానికి ప్రమాదకరంగా మారుతుంది. నవంబర్ 18 నుంచి 24 వరకు ప్రపంచ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారం జరుగుతోంది. ఈ సందర్భంగా డాక్టర్లు అవసరం లేకుండా యాంటీబయోటిక్స్ తీసుకోవద్దని అందరికీ సూచిస్తున్నారు.
సాధారణంగా యాంటీబయోటిక్ మందులు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల చికిత్సకు మాత్రమే పనికొస్తాయి. కానీ గొంతు నొప్పి, జలుబు, ఫ్లూ వంటివి ఎక్కువగా వైరస్ వల్ల వస్తాయి. వీటిపై యాంటీబయోటిక్స్ పెద్దగా పనిచేయవు. అయినా సరే చాలామంది వాటిని వేసేసుకుంటున్నారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో తీవ్రమైన అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా డాక్టర్ సలహా లేకుండా ఎక్కువ కాలం యాంటీబయోటిక్స్ వాడితే, ఆ మందుల ప్రభావం శరీరంపై తగ్గుతూ వస్తుంది. ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రి ఎమెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ సుభాష్ గిరి చెప్పిన వివరాల ప్రకారం.. అనవసరంగా యాంటీబయోటిక్స్ వేసుకోవడం వల్ల యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (antimicrobial resistance) సమస్య పెరుగుతోంది. అంటే, ఇంతకుముందు బ్యాక్టీరియాని సమర్థవంతంగా చంపేసిన మందులకే, ఆ బ్యాక్టీరియా తట్టుకునే శక్తిని పెంచుకునే పరిస్థితి అన్నమాట. దీనివల్ల ఇన్ఫెక్షన్ కి చికిత్స చేయడం కష్టంగా మారుతుంది, చాలాసార్లు మందులు అసలు పనిచేయకుండా పోతాయి. అప్పుడు వేరే యాంటీబయోటిక్స్ వాడాల్సి వస్తుంది, అవి ఖరీదైనవిగా ఉంటాయి. దీనివల్ల చికిత్స ఖర్చు కూడా పెరిగిపోతుంది. అందుకే జ్వరం, దగ్గు లేదా గొంతు నొప్పి వచ్చినప్పుడు మీకు మీరే యాంటీబయోటిక్స్ వాడకండి. అవసరం అనిపిస్తే డాక్టర్ పరీక్షలు చేసి, ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియాతో వచ్చిందా లేక వైరస్ తో వచ్చిందా అనేది నిర్ణయిస్తారు. ఒకవేళ డాక్టర్ యాంటీబయోటిక్ రాస్తే, ఎంత డోస్ రాశారో అంతే వేసుకోవాలి. ఈ విషయంలో ఎప్పుడూ డాక్టర్ సలహానే పాటించాలి.
Also Read
- Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే 'కరివేపాకు పచ్చడి'.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
- Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
- Chanakya Niti: ఈ 5 రకాల మనుషులతో జాగ్రత్త.. చాణక్య నీతి హెచ్చరిక..
- Healthy Winter Breakfast: చలికాలంలో ఆరోగ్యకరమైన అల్పాహారం.. వేడివేడిగా సజ్జల వెజిటబుల్ ఉప్మా!.. 5 నిమిషాల్లో రెడీ..!
తాజావార్తలు
-
Varanasi OTT Deal: ‘వారణాసి’ ఓటీటీ డీల్.. ఊహించని ధర!
-
CM Chandrababu: కూటమి ధర్మం పాటించాం.. సీట్లు రాలేదని అలగడం ఏంటి..? బీజేపీపై చంద్రబాబు అసహనం..
-
Antibiotics Misuse: జ్వరం, దగ్గు, జలుబుకు యాంటీబయోటిక్స్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
Rahul Gandhi vs Kiren Rijiju: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. 1962 యుద్ధం, పేదరికంపై కాంగ్రెస్‌కు 4 ప్రశ్నలు!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
ట్రెండింగ్
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!