Almond Nutrition Facts: ఈ ఆధునిక కాలంలో చాలా మందిని సతాయించే అతి పెద్ద సమస్య.. బరువు పెరగటం. వాస్తవానికి మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ బాదం తింటే బరువు తగ్గుతారనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై న్యూట్రిషన్లు ఏం చెబుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా.. వాస్తవానికి రోజు
బాదం పప్పులు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: KTR : రాష్ట్రంలో ఉపఎన్నికలు తథ్యం.. కేసీఆర్ సీఎం కాబోతున్నారు
ముఖ్యమైన పోషకాలతో నిండిన బాదం..
గుండెను ఉత్తేజపరిచే లక్షణాలకు బాదం పప్పు ప్రసిద్ధి చెందాయి. వీటిలో విటమిన్ E, ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్, మెగ్నీషియం, వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి హృదయ ఆరోగ్యాన్ని పెంచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. బాదంపప్పులో కొవ్వులు ఎక్కువగా ఉంటాయని, వాటితో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి అనేది ఒక అపోహ అని వెల్లడించారు.
సున్నా కొలెస్ట్రాల్ కలిగిన శాఖాహార కొవ్వుకు బాదం పప్పులు మూలం అని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయని పేర్కొన్నారు. అన్ని కొవ్వులు చెడ్డవి కావని, ప్రతిరోజూ శరీరానికి కొన్ని ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం అవుతాయని వైద్యులు వెల్లడించారు. బాదం పప్పులు మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటాయని, ఇవి గుండె ఆరోగ్యానికి విశేషంగా కృషి చేస్తాయని చెబుతున్నారు.
బాదంను ఎలా తినాలంటే..
పలువురు నిపుణులు మాట్లాడుతూ.. నానబెట్టిన బాదంపప్పు తినడం ఉత్తమం అని చెబుతున్నారు. బాదంపప్పులను నానబెట్టడం వల్ల వాటిలోని పోషక నిరోధకాల స్థాయిలు తగ్గుతాయని పేర్కొన్నారు. నిజానికి వీటిని పొట్టుతో పాటు తినాలని, అలా చేస్తే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఒక గుప్పెడు బాదం పప్పులు సుమారుగా 6 గ్రాముల ప్రోటీన్‌ను కలిగి ఉంటాయని తెలిపారు. అలాగే వీటిని తినడం కారణంగా త్వరగా ఆకలి వేయదని, దీంతో బరువు పెరిగినట్లు బాధపడే వారికి ఇవి చాలా బాగా ఉపయోగపడుతాయని చెబుతున్నారు.
* బాదం తినడం వల్ల LDL కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఇవి మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు.
* మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు బాదం పప్పుల్లో ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో విశేషంగా సహాయపడతాయని పేర్కొన్నారు. అలాగే గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయని వెల్లడించారు.
* బాదం పప్పులు ఆహార ఫైబర్‌లకు మంచి మూలం అని, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని, అలాగే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కృషి చేస్తుందని చెప్పారు. ఇవి మొత్తం హృదయ ఆరోగ్యానికి ఉపయోగపడుతాయని చెబుతున్నారు.
* క్రమం తప్పకుండా బాదం పప్పులను తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలు మెరుగుపడతాయి. వీటిలో పొటాషియం కంటెంట్ ఉంటుందని, దీనితో రక్తపోటు స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు.
* బాదంలో యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా విటమిన్ E పుష్కలంగా ఉంటాయని, ఇవి గుండె జబ్బులకు కారణమయ్యే ఆక్సీకరణ నష్టం, వాపు నుంచి కణాలను రక్షించడంలో విశేషంగా సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పులను మితంగా మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఎక్కువగా తీసుకున్నా అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు.
READ ALSO: Broken Heart Syndrome: లవ్ బ్రేకప్ అయితే గుండెపోటు వస్తుందా?