NTV Telugu Site icon

Viral News: 24 ఏళ్లుగా రోజూ10 సిగరెట్లు.. ఒక్కసారిగా మానేసిన వ్యక్తి.. ఎలాగో చూడండి

Cigarettes

Cigarettes

సిగరెట్లు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలిసినప్పటికీ, వ్యసనం కారణంగా ప్రజలు ధూమపానం చేస్తూనే ఉన్నారు. ధూమపానం ఊపిరితిత్తులతో సహా అనేక అవయవాలను ప్రభావితం చేస్తుందని, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా కారకంగా మారుతుందని అనేక వైద్య నివేదికలలో చెబుతున్నాయి. ఇది నిజం కూడానూ. సిగరెట్ తాగేవారు తమ జీవితాలను పొగలో గడుపుతారు. కానీ వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. చెడు అలవాట్లను వదులుకోవడం అంత తేలికైన పని కాదు. ధూమపానం మానేయడానికి.. ఒక వ్యక్తి ధృఢ సంకల్పం పొందాలి. అచ్చం అలాంటి సంఘటనే ఒకటి భయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

READ MORE: Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి కేసులో కీలక పరిణామం.. నిందితుడి నార్కో టెస్ట్‌కి హైకోర్టు నిరాకరణ..

24 ఏళ్ల పాటు రోజుకు 10 సిగరెట్లు తాగిన ఓ వ్యక్తి ఈ చెడు అలవాటుకు గుడ్ బై చెప్పి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తన కథనాన్ని పంచుకున్నాడు. ఎక్స్ వినియోగదారులు సిగరెట్ మానేసినందుకు వ్యక్తిని అభినందిస్తున్నారు. పోస్ట్‌పై మద్దతు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎక్స్ పోస్ట్ లో.. “నేను గత 24 సంవత్సరాలుగా రోజూ 10 సిగరెట్లు తాగుతున్నాను. ఈ సంవత్సరం జన్మాష్టమి రోజున, నేను మానేయాలని నిర్ణయించుకున్నాను. నేను సిగరెట్ ముట్టుకుని 17 రోజులు అయ్యింది.” అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇప్పటికే 9.80లక్షల మంది ఈ పోస్ట్ ను లైక్ చేశారు.

READ MORE: Arekapudi Gandhi: కౌశిక్ మాటలకు నా మనసు బాధ పడే ఆవేశపూరితంగా మాట్లాడా: అరికెపుడి

ఇతర ఎక్స్ వినియోగదారులు ఈ పోస్ట్‌పై ప్రోత్సాహం, మద్దతుతో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పోస్ట్‌పై మద్దతునిచ్చే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ వినియోగదారు ఇలా వ్రాశాడు.. “నేను 1982 నుంచి 1996 వరకు నేను రోజుకు సగటున 15-18 సిగరెట్లు తాగాను. జనవరి 4, 1996 న నేను నా విల్స్ ప్యాకెట్‌ను నలిపివేసి విసిరేశాను. అప్పటి నుంచి మళ్లీ ముట్టుకోలేదు. సిగరెట్‌ను ముట్టుకుని 29 సంవత్సరాలు అయ్యింది.” అని రాసుకొచ్చాడు.

Show comments