UGC Net: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 2026 సెషన్‌కు సంబంధించిన యూజీసీ నెట్ (UGC NET) అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించడానికి.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పొందాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక కీలకమైన అవకాశం. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 29, 2026 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు మే 20, 2026 రాత్రి 11:50 గంటల వరకు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు.
ఈ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన గడువులను పరిశీలిస్తే, ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 29 నుంచి ప్రారంభమయ్యాయి. దరఖాస్తు సమర్పించడానికి.. పరీక్షా రుసుము చెల్లించడానికి చివరి తేదీ మే 20గా నిర్ణయించారు. ఒకవేళ దరఖాస్తులో ఏవైనా తప్పులు దొర్లితే, వాటిని సరిచేసుకోవడానికి అభ్యర్థులకు మే 22 నుంచి మే 24 వరకు ‘కరెక్షన్ విండో’ అందుబాటులో ఉంటుంది. జూన్ 10 నాటికి అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రం (సిటీ) వివరాలు తెలుస్తాయి. ఇక హాల్ టికెట్లు లేదా అడ్మిట్ కార్డులను జూన్ 15 నాటికి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. పరీక్షలు జూన్ 22 నుంచి జూన్ 30 మధ్య వివిధ దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించబడతాయి.
Also Read
- RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
- Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
- One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. ఇతర ఏ మార్గాల్లో దరఖాస్తు చేసినా అవి తిరస్కరించబడతాయి. అభ్యర్థులు కేవలం ఒక దరఖాస్తును మాత్రమే సమర్పించాలని, ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఎన్టీఏ స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు పని చేస్తున్న మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడిని మాత్రమే ఇవ్వాలి, ఎందుకంటే భవిష్యత్తులో పరీక్షకు సంబంధించిన అన్ని సమాచారాలు వీటి ద్వారానే పంపబడతాయి. ఈసారి అభ్యర్థుల సౌలభ్యం కోసం ‘మేరీ పెహచాన్’ (సింగిల్ సైన్-ఆన్ సర్వీస్) ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు ఎన్టీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచార బులెటిన్‌ను క్షుణ్ణంగా చదివి, తమ సబ్జెక్టులు, అర్హత ప్రమాణాలను సరిచూసుకోవాలి. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు రాకుండా ఉండటానికి గడువు ముగియడానికి ముందే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం. అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా జెఆర్ఎఫ్ వంటి ఉన్నత స్థాయి లక్ష్యాలను చేరుకోవడానికి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ జూన్ సెషన్ అత్యంత కీలకం కానుంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?