Mecon India Ltd Recruitment Notification 2024: మెకాన్ రిక్రూట్‌మెంట్ 2024 ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న ఉద్యోగార్ధులకు మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 309 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీర్ (సివిల్), ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ ఇంజనీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) అభ్యర్థులు 10 జూలై 2024 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు గడువు 31 జూలై 2024న ముగుస్తుంది. మెకాన్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది. MECON Ltd యొక్క అప్లికేషన్ ఆన్‌లైన్ మోడ్ ద్వారా అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం meconlimited.co.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Salt: ఉప్పు అధికంగా తినడం వల్ల చాలా ప్రమాదం..డబ్య్లూహెచ్ వో ఏం చెప్తోంది..
* డిప్యూటీ ఇంజినీర్: 87 పోస్టులు
* ఇంజినీర్: 01 పోస్టు
* అసిస్టెంట్ ఇంజినీర్: 88 పోస్టులు
* జూనియర్ ఇంజినీర్: 15 పోస్టులు
* అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్: 08 పోస్టులు
* జూనియర్ ఎగ్జిక్యూటివ్: 04 పోస్టులు
* డిప్యూటీ ఎగ్జిక్యూటివ్: 10 పోస్టులు
* ఎగ్జిక్యూటివ్: 01 పోస్టు
Prabas Kalki 2898 AD : థాంక్స్ డార్లింగ్స్.. కల్కి విజయంపై ప్రభాస్ వీడియో..
మొత్తంగా 309 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, సంస్థ ఉద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. సంబంధిత విభాగలలో సీఎంఏ/ సీఏ/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా కలిగి ఉండాలి. విద్యార్హతలు, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.