LIC Recruitment 2025: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. రూ.లక్షన్నర జీతంతో ఎల్ఐసీలో ఉద్యోగాలు!
- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో ఉద్యోగాలు
- 81 అసిస్టెంట్ ఇంజినీర్లు
- 410 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు.
- licindia.in ద్వారా దరఖాస్తు.
LIC Recruitment 2025: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 2025 సంవత్సరానికి భారీ నియామకాలను ప్రకటించింది. మొత్తం 491 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ఖాళీలలో 81 అసిస్టెంట్ ఇంజినీర్లు, 410 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 16, 2025 నుంచి సెప్టెంబర్ 8, 2025 వరకు licindia.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలని ఎల్ఐసీ సూచించింది.
Naveen Patnaik Hospitalized: ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం.. హెల్త్ అప్డేట్ ఏంటంటే..?
Also Read
- HIGH COURT OF ANDHRA PRADESH: ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. రెండ్రోజులే ఛాన్స్.. త్వరగా అప్లై చేసుకోండి
- LIC HFL 2026: గ్రాడ్యుయేట్లకు అద్భుత అవకాశం.. ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్.. ఎలిజిబిలిటీ, శాలరీ వివరాలు
- CRPF Constable Recruitment 2026: గెట్ రెడీ.. 9175 కానిస్టేబుల్ పోస్టులు.. అర్హులు వీరే
- SSC Selection Post Phase 14: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 3000+ జాబ్స్.. 10th, 12th, డిగ్రీ పాసైతే చాలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన వారు ఏదైనా గ్రాడ్యుయేషన్, B.Tech/B.E, LLB, CA, ICSI అర్హత కలిగి ఉండాలి. ఇక ఈ ఉద్యోగాలకు వయస్సు పరిమితి విషయానికి వస్తే.. కనీస వయస్సు 21 సంవత్సరాలు కాగా, గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు. అంతేకాదు ప్రభుత్వ నియమావళి ప్రకారం వయస్సులో రాయితీలు కూడా వర్తిస్తాయి. ఈ ఉద్యోగాల ఎంపిక కోసం రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించబడతాయి. అందులో మొదటిది ప్రీలిమినరీ ఎగ్జామ్ కాగా, అందులో విజయం సాధిస్తే మెయిన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్షకు 7 రోజుల ముందు అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
India Finds Estimated 20 Tonnes of Gold: భారత్‌లో బంగారు నిధి.. ఎన్ని టన్నులు అంటే?
ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. SC/ST/PwBD అభ్యర్థులకు రూ.85 + GST + ట్రాన్సాక్షన్ ఛార్జీలు కాగా, ఇతర అభ్యర్థులకు రూ.700 + GST + ట్రాన్సాక్షన్ ఛార్జీలు వర్తిస్తాయి. ఇకపోతే ఎల్ఐసీ ఉద్యోగులకు ఆకర్షణీయమైన వేతనాలు ఉంటాయి. అసిస్టెంట్ ఇంజినీర్లు, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు ప్రాథమిక జీతం నెలకు రూ.88,635గా నిర్ణయించబడింది. వేతన శ్రేణి ప్రకారం ఇది గరిష్టంగా రూ. 1,69,025 వరకు పెరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు లేదా మరేదైనా ఉద్యోగమైనా చేసే వారు పూర్తి నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని licindia.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
-
MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
-
North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!