JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో సంచలనం.. ముగ్గురు తెలుగు స్టూడెంట్స్‌కు 100% పర్సంటైల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కబరిచారు. బీఈ/బీటెక్ పేపర్‌కు సంబంధించిన సెషన్-1 ఫలితాలు విడుదల కావడంతో మొత్తం సుమారు 13 లక్షల మంది అభ్యర్థుల్లో 12 మంది 100 పర్సెంటైల్ సాధించగా, వారిలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉండటం సంచలనంగా మారింది. ఏపీకి చెందిన ఇద్దరు, తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఈ ఫలితాల్లో 100 పర్సెంటైల్ సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నరేంద్రబాబు గారి మహిత్(NARENDRABABU GARI MAHITH), పసల మోహిత్(PASALA MOHITH) తెలంగాణకు చెందిన వివాన్ శరద్ మహిశ్వరి(VIVAN SHARAD MAHISWARI) సత్తా చాటారు.
READ MORE: Loot Deal: సరికొత్త ‘ఓపెన్ ఇయర్’ బడ్స్.. జిమ్, రన్నింగ్‌కు బెస్ట్ ఆప్షన్.!
Also Read
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లోని పరీక్షా కేంద్రాలు కలిపి మొత్తం 326 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగిన ఈ ఎగ్జామ్‌ను 13 భాషల్లో రాయడానికి అవకాశం కల్పించారు. జనవరి 21 నుంచి 29 వరకు సెషన్-1 పరీక్షలు జరిగాయి. ప్రతి రోజు రెండు షిఫ్టులుగా పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు మరో షిఫ్ట్ జరిగింది. బీఈ/బీటెక్ పేపర్ మాత్రం జనవరి 21 నుంచి 28 మధ్య నిర్వహించారు. ఈసారి ప్రశ్నాపత్రం మొత్తం చూసుకుంటే మోస్తరు కఠినతరంగా ఉందని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడ్డారు. కొన్ని షిఫ్టుల్లో ఫిజిక్స్ కాస్త కఠినంగా ఉండగా, మరికొన్ని షిఫ్టుల్లో మ్యాథ్స్ ఎక్కువ సమయం తీసుకున్నట్టు చెప్పారు. కెమిస్ట్రీ మాత్రం చాలామందికి స్కోరింగ్ సబ్జెక్ట్‌గా మారింది. 100 పర్సెంటైల్ సాధించిన తెలుగు విద్యార్థులు దేశవ్యాప్తంగా ప్రతిభ చాటడంతో పాఠశాలలు, తల్లిదండ్రులు గర్వంగా భావిస్తున్నారు. కష్టపడి సిద్ధమైతే జాతీయ స్థాయి పరీక్షల్లోనూ అగ్రస్థానాలు సాధించవచ్చని వారు నిరూపించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!