NTV Telugu Site icon

Indian Youth Opting Gig jobs: ‘గిగ్‌’ జాబ్స్‌ వైపు.. భారతీయ యువత చూపు..

Indian Youth Opting Gig Jobs

Indian Youth Opting Gig Jobs

Indian Youth Opting Gig jobs: మన దేశంలో యువత గతంలో ఎన్నడూ లేనంతగా గిగ్‌ జాబ్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో గతేడాది కన్నా 50 శాతం ఎక్కువ మంది ఈ కొలువుల్లో చేరారు. ముఖ్యంగా జాబ్‌ ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్ల 3 నుంచి 5 ఏళ్ల అనుభవం కలిగినవారు వీటిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు ఫ్లెక్సింగిట్‌ అనే ఫ్రీల్యాన్స్‌ జాబ్స్‌ ప్లాట్‌ఫాం వెల్లడించింది. టెక్నాలజీ స్కిల్స్‌కి డిమాండ్‌ నెలకొనటం వల్ల కూడా గిగ్‌ జాబ్స్‌ రిక్రూట్మెంట్లు పెరుగుతున్నాయి. అయితే మహిళలు ఈ ఆప్షన్‌ను పెద్దగా ఎంపిక చేసుకోవట్లేదని ఫ్లెక్సింగిట్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ చంద్రిక తెలిపారు.

363 కొత్త బ్రాంచ్‌లు

ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి 21 రాష్ట్రాల్లో దాదాపు 363 కొత్త శాఖలను ప్రారంభించాలని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పించిన ‘ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ డ్రైవ్‌’ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 3 వేల కన్నా ఎక్కువ మంది జనాభా గల గ్రామాలకు 5 కిలో మీటర్ల లోపు దూరంలో కనీసం ఒక బ్యాంక్‌ బ్రాంచ్‌ ఉండేలా ఏర్పాటుచేయనున్నారు. స్టేట్‌ లెవల్‌ బ్యాంకింగ్‌ కమిటీ సూచించే ప్రాంతాల్లో ఈ శాఖలను ఓపెన్‌ చేయనున్నారు.

Hidden Valleys in Himalayas Live: హిమాలయాల్లో రహస్య స్వర్గం

గల్ఫ్‌ దేశాల నుంచే

సమీప భవిష్యత్‌లో భారత్‌కు క్రూడాయిల్‌ ఎక్కువగా సౌదీ అరేబియా, ఇరాక్‌ వంటి గల్ఫ్‌ దేశాల నుంచే వస్తుందని పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. ఆయా దేశాల్లో సురక్షితమైన, సరసమైన ఇంధన వనరులు ఉన్నట్లు ఇండియా భావిస్తోందని చెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధం అనంతరం రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేయకూడదంటూ పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యా నుంచి చమురు చౌకగా లభిస్తుండటంతో భారతీయ రిఫైనర్లు అటు వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.