India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
- GDS 2026 ఫలితాలు
- మెరిట్ లిస్ట్‌లో పేరు ఉంటే తర్వాత ఏం చేయాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Post GDS Result 2026: భారతీయ తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్. India Post GDS Result 2026 మొదటి మెరిట్ లిస్ట్ విడుదలైంది. అభ్యర్థులు తమ రాష్ట్రానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ PDFను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని, అందులో తమ రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. ఈ మెరిట్ లిస్టులను రాష్ట్రాల వారీగా విడుదల చేస్తారు. జాబితాలో పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న అభ్యర్థులు తదుపరి దశలో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
India Post GDS Result 2026: అధికారిక వెబ్సైట్
GDS మొదటి మెరిట్ లిస్ట్‌ను తనిఖీ చేయాలనుకునే అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
Also Read
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
అధికారిక వెబ్సైట్: https://indiapost.gov.in/gdsonlineengagement
వెబ్సైట్లో అందుబాటులో ఉన్న Shortlisted Candidates విభాగంలో సంబంధిత నోటిఫికేషన్‌ను ఎంచుకొని, తమ రాష్ట్రానికి సంబంధించిన PDFను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మెరిట్ లిస్ట్‌లో ఏ వివరాలు ఉంటాయి?
India Post GDS మెరిట్ లిస్ట్‌లో అభ్యర్థులకు సంబంధించిన పలు వివరాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ కింది అంశాలను తనిఖీ చేయాలి.
సీరియల్ నంబర్
డివిజన్ పేరు
పోస్టాఫీస్ వివరాలు
పోస్టు ఐడీ, పోస్టు పేరు
అభ్యర్థి కేటగిరీ
రిజిస్ట్రేషన్ నంబర్
మెరిట్ లిస్ట్‌లో పేర్కొన్న మార్కులు
అభ్యర్థులు PDFను తెరిచిన తర్వాత తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించి వివరాలు గుర్తించవచ్చు.
GDS మొదటి మెరిట్ లిస్ట్ PDF డౌన్లోడ్ చేయడం ఎలా?
ముందుగా అధికారిక వెబ్సైట్ https://indiapost.gov.in/gdsonlineengagement ను ఓపెన్ చేయండి.
హోమ్‌పేజీలో Shortlisted Candidates: Schedule-II, July-2026 అనే విభాగం అందుబాటులో ఉందో చూడండి.
ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి.
సంబంధిత మెరిట్ లిస్ట్ PDFను ఓపెన్ చేయండి.
PDFలో మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను వెతకండి.
భవిష్యత్తు అవసరాల కోసం PDFను డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి.
డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు ఏ పత్రాలు తీసుకెళ్లాలి?
మెరిట్ లిస్ట్‌లో చోటు దక్కిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుపు వచ్చినప్పుడు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. సాధారణంగా సంబంధిత నోటిఫికేషన్ ప్రకారం కింది పత్రాలు అవసరమవుతాయి.
విద్యార్హత మార్కుల మెమోలు, సర్టిఫికెట్లు
గుర్తింపు కార్డు
కుల ధ్రువీకరణ పత్రం- వర్తిస్తే
దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం- వర్తిస్తే
EWS సర్టిఫికెట్ – వర్తిస్తే
ట్రాన్స్‌జెండర్ ధ్రువీకరణ పత్రం – వర్తిస్తే
జనన తేదీకి సంబంధించిన ఆధారం
నోటిఫికేషన్లో తప్పనిసరిగా పేర్కొన్న వైద్య ధ్రువీకరణ పత్రం
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం లేదా గోవా రాష్ట్రాల్లో వర్తించే స్థానిక భాష లేదా గిరిజన భాషా పరిజ్ఞాన ధ్రువీకరణ పత్రం – అవసరమైన సందర్భాల్లో
మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులు తమకు పోస్టింగ్ కేటాయించిన డివిజన్‌కు సంబంధించిన డివిజనల్ కార్యాలయంలో 27/10/2026 లోపు (అక్టోబర్ 27, 2026 నాటికి) తమ ధ్రువపత్రాల పరిశీలన (Document Verification) పూర్తి చేయించుకోవాలి. అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే సమయంలో సంబంధిత పత్రాల అసలు ప్రతులతో పాటు, వాటి రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!