కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు..ఇప్పటికే ఖాళీలు ఉన్న ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఉద్యోగాలకు సంబందించి నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు..న్యూఢిల్లీలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, అండ్ ట్రేడ్ మార్క్స్,డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.. మొత్తం 553 ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స్ గ్రూప్ ఎ పోస్టులను భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు..
బయో-టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, బయో-కెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో-మెడికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ , కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫిజిక్స్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు..
అర్హతలకు సంబంధించి డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణత పొందిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది… ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.. దరఖాస్తులకు ఆగస్టు 4, 2023వ తేదీ తుదిగడువుగా నిర్ణయించారు. ప్రిలిమ్స్ సెప్టెంబర్ 3, 2023వ తేదీన నిర్వహిస్తారు. మెయిన్స్ అక్టోబర్ 1, 2023న ఉంటుంది. మెయిన్స్ ఫలితాలు అక్టోబర్ 16న విడుదలవుతాయి.. ఈ ఉద్యోగాల కు సంబంధించి మరిన్ని వివరాల కోసం https://qcin.org/ వెబ్ సైట్ ను చూడగలరు.. గతంలో విడుదలైన నోటిఫికేషన్ కన్నా ఈసారి ఎక్కువ పోస్టులను భర్తీ చెయ్యనున్నట్లు అధికారులు తెలిపారు..