బీటెక్ క్వాలిఫికేషన్ తో ఐటీ జాబ్స్ ను మించిన గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఐటీ సెక్టార్ లో లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ ప్రభుత్వ కొలువుల వైపు దృష్టిసారించే వారు ఎక్కువవుతున్నారు. మరి మీరు కూడా బీటెక్ క్వాలిఫికేషన్ తో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. బెల్ 350 ప్రొబెషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
భర్తీకానున్న పోస్టుల్లో ఎలక్ట్రానిక్స్ విభాగంలో 200 పోస్టులు, మెకానికల్ విభాగంలో 150 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు పోటీపడే వారు పోస్టులను అనుసరించి బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 01-01-2025 నాటికి 25 ఏళ్లు నిండి ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు సీబీటీ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎంపికై వారికి నెలకు రూ.40,000- రూ.1,40,000 వరకు జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులు రూ.1000 + జీఎస్టీ (రూ.1180) చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కలిపించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జనవరి 31 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ https://bel-india.in/ పై క్లిక్ చేయండి.