Demand Courses: ఈ కోర్సులకు భారీగా డిమాండ్.. లక్షల్లో జీతాలు?
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులకు భారీగా డిమాండ్
- లక్షల్లో జీతాలు
- యువత ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటర్మీడియట్ కాగానే ఉన్నత విద్య కోసం ఏ కోర్సుల్లో చేరాలనే దానిపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు చర్చించుకుంటారు. దేశంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్, ఇంజనీర్ కావాలని ఆశిస్తుంటారు. ఇటీవలికాలంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో విద్యార్థులు ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయి. పైగా మంచి సాలరీ కూడా వస్తుంది. అందుకే ఆ ఆర్టికల్‌లో భవిష్యత్‌లో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఐదు ముఖ్యమైన ఏఐ కోర్సులు గురించి తెలుసుకుందాం.
READ MORE: QG Gang War Trailer: ‘క్యూజీ గ్యాంగ్‌వార్’ ట్రైలర్ విడుదల.. అదరగొట్టేసిన ప్రియమణి, సన్నీలియోన్
Also Read
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
1. మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్స్
మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్స్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఏఐ ఇన్నోవేషన్‌లో కీలక భూమిక పోషిస్తారు. వీరు ప్రధానంగా ఏఐ అల్గారిథమ్స్‌ను రూపొందిస్తారు. ఆటోమెటిక్ వాహనాలు, ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్ రంగాల్లోనూ వీరి పాత్ర చాలా కీలకం. మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్స్ తమ ఉద్యోగంలో బాగా రాణించాలంటే, బలమైన అనలెటికల్ స్కిల్స్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌పై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. అలాగే భారీ డేటా సెట్స్‌ను విశ్లేషించగలగాలి. అందుకే ఈ సామర్థ్యాలు అన్నీ ఉన్న మెషిన్ లెర్నంగ్ ఇంజినీర్స్‌కు లక్షల్లో జీతం ఉంటుంది.
2. రోబోటిక్స్ ఇంజినీర్స్
రోబోటిక్స్ ఇంజినీర్లు స్వయం ప్రతిపత్తితో పనిచేసే ఇంటిలిజెంట్ మెషీన్లను రూపొందిస్తుంటారు. తయారీ, ఆరోగ్య సంరక్షణ వంటి పలు రంగాల్లో రోబోటిక్స్ ఇంజినీర్స్ అవసరం అవుతారు. ఆటోమేషన్‌కు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ, మంచి నైపుణ్యం కలిగిన రోబోటిక్స్ ఇంజినీర్స్ కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల వీరికి కూడా లక్షల్లో జీతాలు లభిస్తాయి.
READ MORE: Husband Kills Wife: డంబుల్స్తో భార్యను కొట్టి చంపిన భర్త.. కారణమిదే..?
3. డేటా సైంటిస్ట్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. సంక్లిష్ట డేటా సెట్లను విశ్లేషించడంలో డేటా సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. మార్కెటింగ్, ఆరోగ్య సంరక్షణ వంటి పలు రంగాల్లో డేటా సైంటిస్టులకు ఫుల్ డిమాండ్ ఉంది. డేటా అనాలసిస్, పాట్రన్స్ ఐడెంటిఫికేషన్, ఆల్గారిథమ్స్ క్రియేషన్ స్కిల్స్ ఉన్న డేటా సైంటిస్ట్లకు భారీ స్థాయిలో జీతభత్యాలు లభిస్తాయి.
4. ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్
రీసెర్చ్ సైంటిస్టులు ఏఐ సైద్ధాంతిక అంశాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తారు. వారు అకడమిక్ సెట్టింగ్, ఆర్ అండ్ డీలో కొత్త మోడల్స్, పద్ధతులను అభివృద్ధి చేయడానికి అత్యాధునిక పరిశోధనలు చేస్తారు. కనుక వారికి న్యూరల్ నెట్‌వర్క్‌లు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ నైపుణ్యాలు ఉండి తీరాలి. కనుక ఈ స్కిల్స్ ఉన్నవారికి లక్షల్లో సాలరీ లభిస్తుంది.
READ MORE: Sunita Williams Salary: సునీతా విలియమ్స్ జీతం ఎంతో తెలుసా?.. షాక్ అవ్వాల్సిందే!
5. ఏఐ ప్రోడక్ట్ మేనేజర్
బిజినెస్ అవసరాలకు అవసరమైన ఏఐ సాంకేతికతను ఏఐ ప్రోడక్ట్ మేనజర్లు పర్యవేక్షిస్తుంటారు. అంటే వ్యాపారానికి, సాంకేతికకు మధ్య ఒక వారధిగా వారు పనిచేస్తుంటారు. ముఖ్యంగా ఏఐ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిని పర్యవేక్షించి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అవి ఉండేలా చూస్తారు. మీరికి కూడా మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కనుక ఆకర్షణీయమైన సాలరీలను పొందవచ్చు.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..