ట్రంప్‌కు అమెరికన్లు గట్టి షాకిచ్చారు. స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఏడాది పాలనలోనే ట్రంప్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల ఫలితాల్లో ఇండియన్-అమెరికన్ ముస్లిం అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ ఘన విజయం సాధించారు. న్యూయార్క్‌కు తొలి ముస్లిం మేయర్‌గా మమ్దానీ రికార్డ్ సృష్టించారు. శతాబ్ద కాలంలో న్యూయార్క్‌కు మేయర్‌గా అతి పిన్న వయస్కుడైన మమ్దానీ (34) ఎన్నికై చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ జనవరి 1, 2026న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇక వర్జీనియా గవర్నర్‌గా డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్‌బెర్గర్ విజయం సాధించగా.. న్యూజెర్సీ గవర్నర్‌గా డెమోక్రాట్ అభ్యర్థి మికి షెర్రిల్ విజయం సాధించారు. రిపబ్లికన్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఓడించిన తర్వాత స్పాన్‌బెర్గర్ వర్జీనియాకు తొలి మహిళా గవర్నర్‌గా రికార్డ్ సృష్టించారు.
ఇది కూడా చదవండి: Plane Crashe: అమెరికాలో కూలిన అతిపెద్ద కార్గో విమానం.. ముగ్గురు మృతి
ఇదిలా ఉంటే న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో అత్యధిక స్థాయిలో ఓట్లు నమోదైనట్లుగా నగర ఎన్నికల బోర్డు తెలిపింది. 2 మిలియన్లకు పైగా న్యూయార్క్ వాసులు బ్యాలెట్లను వినియోగించుకున్నారని పేర్కొంది.
మమ్దానీ బ్యాగ్రౌండ్
మమ్దానీ.. అక్టోబర్ 18, 1991లో జన్మించారు. ఉగాండాలోని కంపాలాలో పుట్టారు. విద్యావేత్త మహమూద్ మమ్దానీ, చిత్ర నిర్మాత మీరా నాయర్ దంపతులకు జన్మించారు. మమ్దానీ ఐదేళ్ల వయసులో సౌతాఫ్రికాకు వచ్చారు. అనంతరం ఏడేళ్ల వయసులో అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. బ్రోంక్స్ హై స్కూల్ ఆఫ్ సైన్స్ నుంచి పట్టభద్రుడయ్యారు. 2014లో మైనేలోని బౌడోయిన్ కళాశాల నుంచి ఆఫ్రికానా అధ్యయనాల్లో మేజర్ డిగ్రీని పొందారు.
మమ్దానీ భార్య పేరు రమా సవాఫ్ దువాజీ. ఈమె సిరియన్-అమెరికన్ చిత్రకారిణి. దువాజీ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో సిరియన్ తల్లిదండ్రులకు జన్మించింది. యూఎస్, దుబాయ్‌లో ఎక్కువ కాలం గడిపారు. ఖతార్‌లోని వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్‌లో చదువుకున్నారు. అనంతరంత న్యూయార్క్‌లోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ నుంచి ఇలస్ట్రేషన్‌లో మాస్టర్స్ కోసం విశ్వవిద్యాలయంలోని రిచ్‌మండ్ క్యాంపస్‌కు బదిలీ అయ్యారు.
దువాజీ.. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన వెంటనే 2021లో డేటింగ్ యాప్ హింజ్ ద్వారా మమ్దానీని కలిశారు. అక్టోబర్ 2024లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఫిబ్రవరి 2025లో న్యూయార్క్ నగర క్లర్క్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు.
దువాజీ రచనలు..
ది న్యూయార్కర్, వోగ్, బీబీసీ, ది వాషింగ్టన్ పోస్ట్, టేట్ మోడర్ వంటి ప్రచురణల్లో దువాజీ రచనలు ముద్రింపబడ్డాయి. తరచుగా మధ్యప్రాచ్య మహిళల అనుభవాలను అన్వేషిస్తూ ఉండేవారు.
Zohran Mamdani is running away with the NYC mayoral race. pic.twitter.com/yzYurT3VeZ
— Polymarket (@Polymarket) November 4, 2025
