ట్రంప్‌కు అమెరికన్లు గట్టి షాకిచ్చారు. స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఏడాది పాలనలోనే ట్రంప్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
అగ్ర రాజ్యం అమెరికాలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. అన్ని చోట్ల డెమోక్రటిక్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోయారు. రిపబ్లికన్ పార్టీ చతికిలపడింది.