NTV Telugu Site icon

Yahya Sinwar: హమాస్‌ చీఫ్ సిన్వర్‌ చివరి క్షణాలు.. నెట్టింట వీడియో వైరల్

Sinvar

Sinvar

Yahya Sinwar: ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కు భారీ షాక్ తగిలింది. ఈ మిలిటెంట్‌ గ్రూప్‌ చీఫ్, 2023 అక్టోబరు 7 నాటి దాడుల సూత్రధారి అయిన యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్‌) మట్టుబెట్టింది. కాగా, చనిపోయే ముందు సిన్వర్‌ యొక్క చివరి కదలికలకు సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి. ఈ కదలికలను ఇజ్రాయెల్‌ డ్రోన్‌ ద్వారా రికార్డు చేయబడింది. ఓ శిథిల భవనంలోని సోఫాలో అతడు కూర్చుని ఉండగా.. డ్రోన్ అతడిని వీడియో తీసింది. దాన్ని గమనించిన సిన్వర్ ఓ కర్రలాంటి వస్తువును దానిపైకి విసిరినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ దృశ్యాలను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ అంతర్జాతీయ అధికార ప్రతినిధి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

Read Also: Gunfire Due To Pizza: పిజ్జా కోసం తుపాకీతో కాల్పులు.. మహిళా పరిస్థితి విషమం

ఇక, దీనిపై ఇజ్రాయెల్‌ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ మాట్లాడుతూ.. శిథిలమైన భవనం లోపల హమాస్‌ మిలిటెంట్లు ఎవరైనా ఉన్నారా? అని తెలుసుకునేందుకు డ్రోన్‌ను పంపించామన్నారు. తొలుత ఆ వ్యక్తిని తాము యహ్వా సిన్వర్‌ అనుకోలేదు.. కేవలం మిలిటెంట్‌ అనే అనుకున్నాం.. ఆ తర్వాత భవనంపై మరోసారి బాంబు దాడి చేయగా.. ఆ భవనం కుప్పకూలిపోయి అతడు చనిపోయాడు. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే అతడు సిన్వర్‌ అని తేలిందన్నారు. అతడి శరీరంపై బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌, గ్రనేడ్లు ఉండటం గుర్తించామని డేనియల్‌ హగారీ చెప్పుకొచ్చారు.

Read Also: KTR Tweet: మూసీ మురుగులో పొర్లుతూ అంద‌రికీ బుర‌ద‌ను అంటించాల‌ని.. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్

కాగా, దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్‌ మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ సైనికులు చంపేశారు. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్‌ పోలికలు ఉన్నాయని ఐడీఎఫ్ గుర్తించింది.. దీంతో డీఎన్‌ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించింది.. గ‌తంలో అతడు ఇజ్రాయెల్ క‌స్టడీలో ఉన్న సమయంలో సేకరించిన డీఎన్ఏ నమూనాలతో వాటిని పరీక్షించగా.. హమాస్‌ నేత అని తేలడంతో సిన్వర్ మరణాన్ని ఇజ్రాయెల్ ధ్రువీకరించుకుంది. అయితే, అతడి మృతిని హమాస్ మిలిటెంట్‌ సంస్థ ఇంకా ప్రకటించలేదు.

Show comments