Site icon NTV Telugu

Israel: ఇజ్రాయిల్‌పై దక్షిణాఫ్రికా కేసు.. వచ్చే వారం ప్రపంచ న్యాయస్థానంలో విచారణ..

World Court

World Court

Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయిల్‌ని గట్టిగా వ్యతిరేకిస్తున్న దేశాల్లో దక్షిణాఫ్రికా కూడా ఉంది. తాజాగా ఇజ్రాయిల్ జెనోసైడ్(మారణహోమానికి) పాల్పడుతోందని దక్షిణాఫ్రికా ఐక్యరాజ్యసమితి ఉన్నత న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది. గాజాలో ఇజ్రాయిల్ ‘జాతి నిర్మూలన’కు పాల్పడుతోందని దక్షిణాఫ్రికా ఆరోపిస్తోంది. వచ్చే వారం ప్రపంచ న్యాయస్థానం ఇరు దేశాల వాదనలను వింటుంది. గాజాలో సైనిక కార్యకలాపాలు ఆపేయాలని ఇజ్రాయిల్ని ఆదేశించాలని సౌతాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కోరుతోంది. ఇజ్రాయిల్ ఈ కేసును అసహ్యమైందిగా అభివర్ణించింది.

Read Also: Fuel Prices: పెట్రోల్ ధరల తగ్గింపు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..

ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తుందని, ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా వేసిన కేసుల జనవరి 11, 12న విచారిస్తామని కోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. జెనోసైడ్ కన్వెన్షన్ కింద ఇజ్రాయెల్ తన బాధ్యతలను ఉల్లంఘించిందని, గాజా ప్రజలపై మారణహోమానికి పాల్పడుతోందని, ఇది మరింత ప్రమాదాన్ని పెంచుతోందని దక్షిణాఫ్రికా గత శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది.

ఈ వ్యవహారంపై ఇజ్రాయిల్ మండిపడుతోంది. దక్షిణాఫ్రికా పిటిషన్‌పై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. గాజా యుద్ధంలో ఇజ్రాయిల్ నైతికతను ప్రదర్శించిందని అన్నారు. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడికి పాల్పడి 1200 మందిని చంపేశారు. ఆ తర్వాత నుంచి గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ వంటి పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయిల్ ఆర్మీ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 20 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు.

Exit mobile version