USA: అమెరికాలో లైసెన్స్ డ్ తుపాకులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మందికి తమ రక్షణ కోసం గన్లను వాడుతుంటారు. అక్కడ లైసెన్స్ జారీ చాలా సులభతరంగా ఉంటుంది. ఇలా తుపాకీ పొందిన వ్యక్తి తను తుపాకీని తుడుస్తుండగా.. ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో అతని భార్య మృతి చెందింది. దీంతో అతను సృహా కోల్పోయాడు. తరువాత తేరుకొని లేచి చూసి తన తప్పిదం వల్ల ఎంత ఘోరం జరిగిందని భావించిన తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలో ఒకే నెలలో ఒకే తరహా మరణాలు రెండు చోటుచేసుకున్నాయి. ఇదే నెలలో తుపాకీతో ఆడుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కి మూడేళ్ళ తన చిట్టి చెల్లిని చేజేతులా చంపుకున్నాడు ఓ బుడతడు. ఆ ఘటన మరువక ముందే అచ్చంగా అలాగే తన తుపాకీని తుడుచుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కి తన భార్యను హతమార్చాడు మరో వ్యక్తి. వెంటనే అచేతన స్థితికి వెళ్ళిపోయిన అతడు స్పృహలోకి వచ్చిన తర్వాత తాను ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో అర్ధం చేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు.
Read also: Mahesh Babu: మహేష్ ఫ్యామిలీ ట్రిప్… మూడు వారాల బ్రేక్?
చికాగోకు చెందిన సిమియోన్ హెన్డ్రిక్సన్(61) తుపాకులు కాల్చడంలో శిక్షణనిస్తూ ఉంటాడు. జులై 15న తీరిక దొరికడంతో ఇంటిలోని తుపాకులను శుభ్రం చేసే పనికి ఉపక్రమించాడు. దురదృష్టవశాతూ ఒక తుపాకి తన చేతిలోనే పేలిపోయింది. ఆ తుపాకీ లోంచి వెళ్లిన బుల్లెట్ అక్కడే ఉన్న అతని భార్య లారీ హెన్డ్రిక్సన్(60) తలకు తగలడంతో ఆమె ఉన్నచోటనే కుప్పకూలింది. విభ్రాంతికి గురైన సిమియోన్ కొద్దీ సేపటికి తేరుకుని జరిగిన దారుణాన్ని తలచుకుని కుమిలిపోయి తుపాకిని తనవైపు ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు. దీంతో తుపాకీ పేలుళ్ల చప్పుడుకి చుట్టుపక్కలవారు సమాచారమిచ్చారో లేక స్వయంగా సిమియోనే చెప్పాడో తెలియదు కానీ పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతానికి వచ్చారు. సిమియోన్ అక్కడికక్కడే చనిపోగా అతని భార్య లారీ మాత్రం కోన ఊపిరితో ఉండగా ఆసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయినట్లు చికాగో పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోవంతో వారి ఒక్కగానొక్క కుమారుడు డెరెక్ హెన్డ్రిక్సన్ శోకతప్త హృదయంతో పేస్ బుక్ లో విషాదం వ్యక్తం చేస్తూ.. “వారిని అందరూ ఎంతగానో ప్రేమించి, అభిమానించేవారు. వారు ఎప్పటికీ గొప్ప తల్లిదండ్రులుగా మిగిలిపోతారు.” అని ఫేస్బుక్ లో పేర్కొన్నాడు.