Megaquake: జపాన్ వరసగా భూకంపాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గురువారం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, రానున్న రోజుల్లో మెగా భూకంపం వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు ఆ దేశాన్ని హెచ్చరిస్తున్నారు. జపాన్ ప్రజలు ‘‘మెగాక్వేక్’’కి సిద్ధం కావాలని చెప్పారు. 2011లో వచ్చిన భూకంపం, సునామీ కారణంగా జపాన్‌లో 18,500 మంది మరణించారు. ఈ సునామీ ఏకంగా ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రాన్ని దెబ్బతీయడంతో అణు విపత్తు కూడా ఏర్పడింది.
జపాన్ వాతావరణ సంఘం(జేఎంఏ) ప్రకారం.. భవిష్యత్తులో వచ్చే భారీ భూకంపాలు పెద్ద సునామీలకు కారణమవుతాయని హెచ్చరించింది. భారీ భూకంపాలు సంభవించే అవకాశం సాధారణం కన్నా ఎక్కువగా ఉందని, ఒక నిర్దిష్ట వ్యవధిలో ఖచ్చితంగా పెద్ద భూకంపం సంభవిస్తుందని చెప్పారు. గతంలో భారీ భూకంపాలు సంభవించిన పసిఫిక్ మహాసముద్రంలోని రెండు టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఉన్న నాంకై ట్రఫ్ ‘‘సబ్‌డక్షన్ జోన్’’లోనే భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Read Also: Bhatti Vikramarka: మూడో విడత రుణమాఫీపై రైతులకు శుభవార్త.. ఆ రోజున రుణమాఫీ
నంకై ట్రంఫ్ అంటే ఏమిటి..?
800 కి.మీ సముద్ర గర్భంలో ఉన్న ఈ ప్రాంతం టోక్యోకు పశ్చిమాన ఉన్న షిజుయోకా నుంచి క్యుషు ద్వీపంలోని దక్షిణ కొనవరకు ఉంటుంది. ఇది ప్రతీ శతాబ్ధానికి లేదా రెండు శతాబ్ధాలకు 8 లేదా 9 తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రాంతం. వీటిని ‘‘మెగాథ్రస్ట్ భూకంపాలు’’ అని పిలుస్తారు. తరుచుగా ఇక్కడ సంభవించే భూకంపాలు ప్రమాదకరమైన సునామీలను కలిగిస్తాయి.
1707లో నంకై ట్రఫ్‌లోని అన్ని భాగాలు ఒక్కసారిగా విడిపోయి, భూకంపం సంభవించింది. ఇది ఆ దేశ చరిత్రలోనే రెండో అంత్యంత శక్తివంతమైన భూకంపంగా మిగిలింది. ఇది ఫుజీ అగ్నిపర్వత విస్పోటనానికి కారణమైంది. 1854లో రెండు శక్తివంతమైన నంకై మెగాథ్రస్ట్‌లు వచ్చాయి. ఆ తర్వాత 1944, 1946లో భూకంపాలు సంభించాయి. నంకై ట్రఫ్ వెంబడి 8-9 భారీ భూకంపాలు వచ్చే 30 ఏళ్లలో 70 శాతం సంభవించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని వల్ల 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చని అంచనా వేస్తున్నారు. 13 ట్రిలియన్ డాలర్ల నష్టం ఏర్పడొచ్చు.