WhatsApp: భారీగా డేటా లీక్.. 50 కోట్ల మంది నంబర్లు అమ్మకానికి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp Data Breach 50 Crore User Mobile Numbers On Sale: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి భారీగా డేటా లీక్ అయ్యింది. పది కాదు, ఇరవై కాదు.. ఏకంగా 48.7 కోట్ల వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లు హ్యాక్ అయ్యాయని, వాటి డేటాబేస్‌ను విక్రయిస్తున్నట్టు ఓ హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్‌లో ప్రకటన పెట్టారని సైబర్ న్యూస్ నివేదిక వెల్లడించింది. ఈ ప్రకటనని ఓ హ్యాకర్ పెట్టినట్లు సైబర్ న్యూస్ పేర్కొంది. అమెరికా, భారత్, యూకే, ఈజిప్ట్, సౌదీ అరేబియాతో పాటు 84 దేశాలకు చెందిన యూజర్ల ఫోన్ నంబర్లను అమ్మకానికి పెట్టారని ఆ కథనం కుండబద్దలు కొట్టింది.
అత్యధికంగా ఈజిప్టు నుంచి 4.5 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల నంబర్లు లీకైనట్టు సైబర్ న్యూస్ కథనం తెలిపింది. ఆ తర్వాత ఇటలీ, అమెరికా, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, టర్కీ, యూకే, రష్యా దేశాల నుంచి వరుసగా 3.5 కోట్లు, 3.2 కోట్లు, 2.9 కోట్లు, 2 కోట్లు, 2 కోట్లు, 1.1కోట్లు, 1 కోటి మంది వాట్సాప్ యూజర్ల డేటా చోరీ అయ్యింది. అంతేకాదు.. ఒక్కో దేశానికి చెందిన యూజర్ల నంబరుకు ఒక్కో ధర కేటాయించినట్టు ఆ నివేదిక పేర్కొంది. అమెరికా డేటా సెట్‌కు అత్యధికంగా 7 వేల డాలర్లు ధర పెట్టగా.. యూకే డేటా ధర 2500 డాలర్లు, జర్మనీ యూజర్ల నంబర్ల ధర 2 వేల డాలర్లుగా ఉన్నట్లు ఆ కథనం వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు ఈ నంబర్లను కొనుగోలు చేసి, మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. కాబట్టి.. గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్ గానీ, మెసేజ్‌లు గానీ వస్తే స్పందించొద్దని సూచించింది.
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
కాగా.. మెటాకు చెందిన సంస్థల్లో ఇలాంటి డేటా లీక్ ఘటనలు చోటు చేసుకోవడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా ఓసారి భారీ డేటా లీక్ అయ్యింది. గతేడాదిలో 50 కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్ యూజర్ల డేటా హ్యాకర్ల చేతికి చిక్కి.. ఆన్‌లైన్‌లో లీకైనట్టు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో మార్క్ జూకర్‌బర్గ్ కొన్ని లీగల్ సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు అతడు ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇచ్చాడు. కానీ, ఏడాది గ్యాప్‌లోనే వాట్సాప్ డేటా లీక్ అవ్వడంతో.. మెటా సంస్థకు సరికొత్త తలనొప్పులు తప్పలేదు.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!