Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా చనిపోయే ముందు, చివరి ప్రసంగంలో ఏం చెప్పాడు..?
- హిజ్బుల్లా చీఫ్ తన చివరి ప్రసంగంలో ఏం చెప్పారు..? పేజర్ పేలుళ్ల తర్వాత ప్రసంగించిన నస్రల్లా..
- ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ..
- చివరకు ఇజ్రాయిల్ చేతిలో హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించాడు. శుక్రవారం జరిగిన బీరూట్‌పై ఇజ్రాయిల్ భీకరదాడులు చేసింది. హిజ్బుల్లా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా వైమానికి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నస్రల్లా మరణించాడు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ఆర్మీతో పాటు హిజ్బుల్లా కూడా ప్రకటించింది. అంతకుముందు హిజ్బుల్లా కీలక కమాండర్లు అయిన ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అఖిల్‌లను కూడా ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లోనే చంపేసింది.
నస్రల్లా చనిపోవడానికి ముందు సెప్టెంబర్ 19న తన చివరి ప్రసంగాన్ని చేశారు. లెబనాన్ వ్యాప్తంగా పేజర్లు పేలిన ఘటన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ పేజర్ల పేలుడులో 37 మంది మరణించాగా, 3000 మంది అత్యంత తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ ఘోరమైన దాడిని ఖండించారు. ఇది ‘‘యుద్ధ ప్రకటన’’గా అభివర్ణించారు. ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసారు, ఇజ్రాయెల్ దురాక్రమణలకు “న్యాయమైన శిక్ష”ని విధిస్తామని అన్నారు. ఈ పేజర్ల దాడిని తమ సంస్థకు ‘‘అపూర్వమైన దెబ్బ’’గా అభివర్ణించాడు. దేవుడిపై విశ్వాసతంతో హిజ్బుల్లా ఈ సంక్షోభం నుంచి మళ్లీ తలెత్తుకుంటుందని చెప్పారు.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
Read Also: Vijayawada: ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం..
సెప్టెంబర్ 20 ఇజ్రాయిల్ బీరూట్‌పై మరో దాడి నిర్వహించి హిజ్బుల్లా యొక్క ఎలైట్ రద్వాన్ యూనిట్ కమాండర్ ఇబ్రహీం అకిల్‌తో పాటు మరో 12 మందిని హతమార్చింది. అకిల్ సంస్థలో సీనియర్ వ్యక్తి మరియు 1983లో బీరుట్‌లోని అమెరికన్ రాయబార కార్యాలయంపై జరిగిన బాంబు దాడిలో అతని ప్రమేయం ఉంది. ఇదిలా ఉంటే గత రెండు వారాలుగా హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయిల్ లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. తమ పౌరులు ఉత్తర ప్రాంతానికి తిరిగి వచ్చేలా చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. లెబనాన్ దాడుల్లో ఇప్పటి వరకు 1000 మందికి పైగా మరణించారు. ఆరు మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!