Hezbollahs: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించాడు. శుక్రవారం జరిగిన బీరూట్‌పై ఇజ్రాయిల్ భీకరదాడులు చేసింది. హిజ్బుల్లా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా వైమానికి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నస్రల్లా మరణించాడు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ఆర్మీతో పాటు హిజ్బుల్లా కూడా ప్రకటించింది. అంతకుముందు హిజ్బుల్లా కీలక కమాండర్లు అయిన ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అఖిల్‌లను కూడా ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లోనే చంపేసింది.
Hassan Nasrallah: హిజ్బుల్లా అధినేత సయ్యద్ హసన్ నస్రల్లా చనిపోయినట్లు ఆ సంస్థ శనివారం ధ్రువీకరించింది. శుక్రవారం లెబనాన్ రాజధాని బీరూట్‌పై జరిగిన దాడిలో నస్రల్లాను హతమార్చామని ఇజ్రాయిల్ ఆర్మీ చెప్పిన కొన్ని గంటల తర్వాత హిజ్బుల్లా నుంచి ఈ ప్రకటన వచ్చింది.
Hassan Nasrallah: ఇజ్రాయిల్ హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. శుక్రవారం లెబనాన్‌లోని బీరూట్‌తో సహా ఇతర ప్రాంతాల్లో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటించింది. ఇకపై ఉగ్రవాదంతో నస్రల్లా ప్రపంచాన్ని భయపెట్టలేడని ఓ ప్రకటనలో పేర్కొంది.