Site icon NTV Telugu

Imran Khan: గతంలో బంగ్లాదేశ్‌లో జరిగిందే.. ఇప్పుడు పాకిస్తాన్‌లో జరుగుతోంది.

Imaran Khan

Imaran Khan

What happened in East Pakistan is happening here now, says imran khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నంతో ఆ దేశంలో రాజకీయ దుమారం రేగుతోంది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు అయిన ఇమ్రాన్ ఖాన్ పై గురువారం కాల్పులు జరిగాయి. పంజాబ్ ప్రావిన్స్ వజీరాబాద్ లో తన మద్దతుదారులతో ర్యాలీ చేస్తున్న సందర్భంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ తో పాటు పలువురు పీటీఐ నాయకులు గాయపడ్దారు. ఒకరు మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నారు. అయితే కీలక నిందితుడు మాత్రం తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం నుంచి కోలుకున్న ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

Read Also: Vladimir Putin: భారతీయులపై రష్యా అధ్యక్షుడి ప్రశంసలు.. ఏమన్నారంటే..

గతంలో ఈస్ట్ పాకిస్తాన్(బంగ్లాదేశ్)లో జరిగిందే.. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతోందని ఇమ్రాన్ అన్నారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక పితామహుడు పేక్ ముజిబుర్ రెహ్మాన్, అతని పార్టీ అవామీ లీగ్ తో ఆయన్ను పోల్చుకున్నారు. గతంలో బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వంపై సైన్యం చర్యలు తీసుకుంది.. దీంతో తూర్పు పాకిస్తాన్ లో ఏం జరిగిందని ప్రశ్నించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో కూడా ఇదే జరుగుతోందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆజాదీ మార్చ్ కు వెళ్తున్న క్రమంలో నాపై హత్యాయత్నం చేస్తారని ముందే తెలుసని ఇమ్రాన్ అన్నారు. ఈ హత్యాయత్నం కుట్రలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో పాటు, ఇంటీరియర్ మంత్రి రాణా సనావుల్లా, ఐఎస్ఐ చీఫ్ మేజర్ జనరల్ ఫైసల్ నసీర్‌ హస్తం ఉందని పీటీఐ నాయకులు ఆరోపిస్తున్నారు.

1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం అనంతరం 18 ఏళ్ల తరువాత బంగ్లాదేశ్ లో భారత్ తో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లానని.. రెండు మ్యాచుల సిరీస్ గెలిచాం. 1971 సమయంలో పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ పై విపరతీమైన ద్వేషం నెలకొందని.. అయితే ఎగ్జిబిషన్ మ్యాచులు గెలిచినప్పుడు, 50 వేల ప్రేక్షకులతో నిండిన స్టేడియం మొత్తం ‘ పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిందని ఇమ్రాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. వారికి మనం చేసిన అన్యాయం ఏమిటో అప్పుడు అర్థమైందని అన్నారు. బంగ్లాదేశీయులు మనల్ని వదిలేందుకు ఇస్టపడలేదు.. కానీ వారికి మనం న్యాయం చేయలేదని ఆయన అన్నారు.

Exit mobile version