Site icon NTV Telugu

Pakistan PM: భారత్ పై యుద్ధంలో మేం గెలిచాం..

Pak Pm

Pak Pm

Pakistan PM: గత మూడు రోజులుగా జరిగిన భారత్- పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు శనివారం సాయంత్రం నాటికి తెరపడింది. కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక, కాల్పుల విరమణపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ తో యుద్ధంలో తాము విజయం సాధించామని తెలిపారు. మా దేశాన్ని, మా పౌరులను రక్షించుకోవడానికి తాము ఏం చేసేందుకు అయినా వెనుదిరిగేది లేదన్నారు. పాకిస్తాన్ ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు.

Read Also: Cease Fire Violation : అమృత్‌సర్‌లో కొనసాగుతున్న హైఅలర్ట్‌.. ప్రజలకు ప్రభుత్వ కీలక సూచనలు!

అయితే, భారత్ తమ దేశంలోని మసీదులు, సామాన్య పౌరులపై డ్రోన్స్, క్షిపణులతో దాడులు చేసిందని.. అనేక మంది సాధారణ పౌరుల చావుకు కారణమైందని ప్రధాని షెహబజ్ షరీఫ్ మండిపడ్డారు. పాకిస్తాన్ పై నిరాధార ఆరోపణలు కూడా చేస్తుంది.. భారత్ కు తగిన బుద్ధి చెప్పాం.. తమ జోలికి వస్తే తాము ఏం చేయగలమో చేసి చూపించాం.. భారత్ పై యుద్ధంలో పాక్ విజయం సాధించిందని షెహబజ్ షరీఫ్ పేర్కొన్నారు.

Read Also: Bangladesh: షాకింగ్.. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌ను నిషేధించిన యూనస్ ప్రభుత్వం!

కాగా, ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుని 3 గంటలైనా గడవక ముందే మరోసారి జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు, కాల్పులతో విరుచుకుపడి తన వక్ర బుద్ధిని బయట పెట్టింది. దీంతో సరిహద్దు రాష్ట్రాల్లో దాడులు జరుగుతుండటంతో బ్లాకౌట్ విధించారు ఇండియన్ ఆర్మీ అధికారులు.

Exit mobile version