NTV Telugu Site icon

Israeli PM: తర్వలోనే ఇరాన్‌పై దాడి చేస్తాం.. మేమే గెలుస్తాం: నెతన్యాహు

Benjamin Netanyahu

Benjamin Netanyahu

Israeli PM: హమాస్ దాడి ప్రారంభించి అక్టోబర్ 7తో సంవత్సరం అయిన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. మా సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందన్నారు. పాలస్తీనా హమాస్ మిలిటెంట్లతో పాటు లెబనాన్ లోని హిజ్బుల్లాతో పోరాడి ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్నంది అన్నారు. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ గెలుస్తుందని చెప్పారు. తమ సైనికులు హమాస్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించారు.. ఉగ్రవాదుల సమూహాన్ని కనుగొనడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తన దృష్టిని ఉత్తరం వైపుకు మళ్లించింది.. ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లాకు వ్యతిరేకంగా సైనిక చర్యను తీవ్రతరం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక, హమాస్‌కు మద్దతుగా లెబనాన్ నుంచి సరిహద్దు మీదుగా రాకెట్‌లను ఇజ్రాయెల్ పై దాడులకు దిగుతుందని బెంజమన్ నెతన్యూహు వెల్లడించారు.

Read Also: Walking Everyday: ప్రతిరోజూ 30 నిమిషాలు నడిస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

గత 12 నెలల్లో మేము వాస్తవికతను పూర్తిగా మార్చామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. అక్టోబరు 7న జరిగిన దాడిని హమాస్ ‘అద్భుతమైనది’గా అభివర్ణించుకుంది. వారి చేసిన దాడిలో 1,205 మంది మరణించారని తెలిపారు. ఈ అర్థరాత్రి సమయంలో మరోసారి ఓడరేపు నగరమైన హైఫాపై సైతం దాడికి దిగింది హిజ్బుల్లా సంస్థ.. వారిని అంతం చేసే వరకు ఆగేది లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇరాన్‌తో యుద్ధ ముప్పు ఉన్నప్పటికీ.. తాము విజయం సాధిస్తామని నెతన్యాహు వెల్లడించారు. ఇక, కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి చేయాలని లెబనీస్ ప్రధాని నజీబ్ మికాటి అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. కాగా, యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఒక ప్రీ-రికార్డ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గాజా సంధికి అంగీకరించాలని ఇజ్రాయెల్, అరబ్ నాయకులపై ఒత్తిడి చేస్తున్నామన్నారు.

Show comments