Site icon NTV Telugu

Donald Trump: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తుందని నాకు ముందే తెలుసు..

Donald Trump

Donald Trump

పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులకు దిగింది. అయితే, ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు.. దీనిపై ఆ దేశం చర్చలకు రావాల్సిందే.. ఇక, ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడులకు దిగితే దాన్ని ఎదుర్కొనేందుకు తమ సెంట్రల్‌ కమాండ్ రెడీగా ఉందన్నారు. అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్‌ను కూడా కాపాడేందుకు రెడీగా ఉందని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు.

Read Also: Gold Price Today: పరుగులు పెడుతున్న పసిడి.. లక్ష దాటేసిన బంగారం ధర!

అయితే, ఇరాన్ పై ఇజ్రాయెల్‌ దాడుల గురించి తమకు ముందు తెలుసు అని డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టెహ్రాన్ అణు సమస్యను దౌత్యపరమైన సంబంధాలతో పరిష్కరించడానికి మేం కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ అంశంపై చర్చలు జరిపేందుకు నా అధికారులను సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్‌ పూర్తిగా అప్రమత్తంగా ఉందని మిలిటరీ చీఫ్‌ ఆఫ్ స్టాఫ్ ఇయాల్‌ జమీర్ వెల్లడించారు. 10 వేల మంది సైనికులను సరిహద్దు దగ్గర సిద్ధంగా ఉంచామని తెలిపారు. తమపై దాడులు చేయడానికి ప్రయత్నించే వారు ఎవరైనా సరే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Exit mobile version