US-China Trade War: అమెరికా కవ్వింపు చర్యలకు చైనా భయపడదు..
- చైనా - అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం..
- ట్రంప్ టారిఫ్‌లపై మండిపడిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి..
- తాము చైనీయులం.. అమెరికా కవ్వింపు చర్యలకు భయపడం: చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-China Trade War: చైనా దిగుమతులపై 125 శాతం పన్నులను అగ్రరాజ్యం అమెరికా విధించింది. ఈ టారిఫ్‌లపై బీజింగ్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాము చైనీయులం.. కవ్వింపు చర్యలకు భయపడమని పేర్కొన్నారు. సుంకాల విషయంలో వెనక్కి తగ్గమని చెప్పుకొచ్చారు. దీనికి ఆమె 1953లో అమెరికా- చైనాల మధ్య యుద్ధం నేపథ్యంలో చైనా నాయకుడు మావో జెడాంగ్ ప్రసంగించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో తాము నిర్ణయించలేం.. అది అమెరికా ఇష్టం.. ఇది ఎంతకాలం జరిగినామేము వెనక్కి తగ్గం.. పూర్తిగా విజయం సాధించే వరకు పోరాటం చేస్తామని జెడాంగ్ పేర్కొన్నారు.
Read Also: RCB VS DC: సెంచరీపై కన్నేసిన విరాట్.. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చాలు!
Also Read
- Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
- America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
- Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
కాగా, అమెరికా, చైనాల మధ్య ప్రస్తుతం వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. డ్రాగన్ దిగుమతులపై ఉన్న 20 శాతం పన్నులకు అదనంగా మరో 34 శాతం విధిస్తున్నట్లు ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. దీనికి దీటుగా చైనా కూడా ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం సుంకం విధించింది. ఇక, బీజింగ్ చర్యపై తీవ్రంగా మడిపడిన ట్రంప్.. 125 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల పలు దేశాలపై విధించిన సుంకాలపై అమెరికా అధినేత ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. 90 రోజుల పాటు ఆయా టారిఫ్‌లను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, వాటిపై 10 శాతం సుంకాలు మాత్రం అమల్లో ఉంటాయని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
-
Ram Mandir Prasad: “రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!