NTV Telugu Site icon

Joe Biden: బైడెన్‌కు మతిమరుపు వచ్చిందా..? చివరి విదేశీ పర్యటన కూడా గుర్తు లేదా..?

Joe Biden

Joe Biden

Joe Biden: అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. 2024 ఎన్నికల కోసం డెమెక్రాట్ల తరుపున మరోసారి జో బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇదిలా ఉంటే రిపబ్లికన్ల తరుపును మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జో బైడెన్ మరోసారి విపక్షాలకు టార్గెట్ అయ్యారు. గతంలో కొన్ని సందర్భాల్లో జో బైడెన్ తడబడటం, మనుషుల్ని పోల్చుకోకపోవడం వంటి సంఘటనలతో వార్తల్లో నిలిచారు.

Read Also: Haryana: దారుణం.. భార్య చేతులు, తల నరికి నిప్పంటించిన వ్యక్తి..

తాజాగా తాను చివరిసారిగా పర్యటించిన విదేశీ పర్యటనను కూడా జో బైడెన్ గుర్తుతెచ్చుకోలేక ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైట్‌హౌస్‌లో ‘టేక్ యువర్ చైల్డ్ టు వర్క్ డే’ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జైడెన్ పాల్గొన్నారు. పిల్లలతో సంభాషించారు. అయితే ఈ సమయంలో ఓ పిల్లాడు, మీరు చివరిసారిగా పర్యటించిన దేశం ఏమిటి..? అని బైడెన్ ను ప్రశ్నించారు. అయితే తాను పర్యటించిన దేశం పేరు గుర్తు తెచ్చుకోవడానికి ఆయన చాలా సేపు ప్రయత్నించారు. ‘‘నేను ప్రయాణించిన చివరి దేశం, నేను చివరిగా ప్రయాణించిన దేశం గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఇప్పటివరకు 89 మంది దేశాధినేతలను కలిశాను.చివరిగా ఎక్కడ ఉన్నానో ఆలోచించడం, ట్రాక్ చేయడం కష్టం.’’ అంటూ సమాధానం ఇచ్చారు.

మరో పిల్లాడు ఐర్లాండ్ అంటూ సమాధానం ఇచ్చాడు. జోబైడెన్ చివరిసారిగా ఐర్లాండ్ లో పర్యటించారు. తాను ఎందుకు అధ్యక్షుడిని అవ్వాలనుకున్నాననే విషయాలను పిల్లలతో పంచుకున్నారు. తన మనవరాళ్ల గురించి, తనకు ఇష్టమైన ఐస్ క్రీం, ఇష్టమైన రంగు గురించి పిల్లలతో సరదాగా ముచ్చటించారు.

Show comments