NTV Telugu Site icon

Zelensky: నేనంటే రష్యా అధ్యక్షుడికి భయం.. తర్వలోనే యుద్ధం ముగుస్తుంది!

Ukribne

Ukribne

Zelensky: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ తనకు మాత్రమే భయపడతారని డొనాల్డ్ ట్రంప్ కు చెప్పినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపాడు. ట్రంప్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్ లతో ఇటీవల భేటీ అయిన విషయం గురించి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేయాలనే బలమైన సంకల్పంతో ట్రంప్ ఉన్నారని.. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జెలెన్ స్కీ పేర్కొన్నారు. యుద్ధానికి ఎలా ముగింపు పలకాలనే అంశంపై తామంతా కలిసి డిస్కస్ చేశామన్నారు. పారిస్‌లో జరిగిన భేటీలో ఆ అంశం మీదే దృష్టి కేంద్రీకరించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

అయితే, రష్యా సైనిక సామర్థ్యాన్ని తగ్గించడంతో పాటు వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడడమే మా లక్ష్యం అని జెలెన్ స్కీ తెలిపారు. ఇతర దేశాలు సాధించలేని వాటిని కూడా సాధించే సామర్థ్యం అమెరికాకు ఉంది.. ఈ యుద్ధాన్ని ముగించడంలో ముందడుగు వేయాలంటే మనలో ఐక్యత అవసరమని జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు. ఈ భేటీ ఏర్పాటు చేసిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Read Also: RGV Case : రామ్‌గోపాల్‌వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు

ఇక, ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్, ఫ్రాన్స్‌ అధినేత ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో త్రైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రష్యాతో కొనసాగుతున్న యుద్ధాన్ని వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలని తాము కోరుకుంటున్నట్లు ట్రంప్‌, మెక్రాన్‌ చెప్పారు. అలాగే, ఉక్రెయిన్‌లో మళ్లీ శాంతిని నెలకొల్పడంతో పాటు ప్రజల భద్రతపై చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ యుద్ధాన్ని నివారించడానికి కృషి చేస్తామని అమెరికా, ఫ్రాన్స్ హామీ ఇచ్చాయి. అయితే, ఇప్పటికే పలుమార్లు తాను అమెరికా అధ్యక్షుడినైతే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి 24 గంటల్లోనే ఆపేస్తానని ట్రంప్ వాగ్దానం చేశారు.