NTV Telugu Site icon

Team India: బీచ్లో వాలీబాల్.. తెగ ఎంజాయ్ చేస్తున్న టీమిండియా క్రికెటర్లు..!

Kohli

Kohli

Team India: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా అక్కడికి చేరుకుంది. ఆ జట్టుతో 2 టెస్ట్ లు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. జూలై 12 నుంచి 16 వరకు డొమినికాలో తొలి టెస్టు జరగనుంది. పర్యటనకు సంబంధించి కింగ్ కోహ్లీ కూడా వెస్టిండీస్ చేరుకున్నాడు. అంతేకాకుండా టీమిండియాలో కూడా చేరాడు. కోహ్లీ చేరగానే.. టీమ్ లో సరదా మొదలైంది. ప్రస్తుతం బార్బడోస్‌లో ఉన్న టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. కాగా.. భారత ఆటగాళ్లు బీచ్‌లో భీకరంగా వాలీబాల్ ఆడుతూ సరదాగా గడిపారు. జట్టు మొత్తం ఎంజాయ్ చేస్తుంటే ఆ వీడియోను భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ చిత్రీకరించాడు.

Professor Fired: క్లాస్‌లోనే బట్టలు విప్పేయమన్నాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు.

జులై 12 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండగా.. పది రోజుల ముందే ప్లేయర్స్ అందరూ కరీబియన్ దీవులకు వెళ్లారు. ఇక తాజాగా డొమినికాలోని ఓ బీచ్ లో ప్లేయర్స్ బీచ్ వాలీబాల్ ఆడుతున్న వీడియోను బీసీసీఐ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది. ఇందులో విరాట్ కోహ్లిలాంటి టాప్ ప్లేయర్స్ తోపాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఆడటం విశేషం.

Shreya Dhanwanthary: అలనాటి హీరోయిన్ కొడుకుతో పీకల్లోతు ప్రేమలో శ్రేయ ధన్వంతరి?

వెస్టిండీస్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా విభిన్నమైన శైలిలో కనిపిస్తుంది. రితురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ టెస్టు జట్టులోకి వచ్చారు. సెలెక్టర్లు కూడా ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్‌లపై విశ్వాసం వ్యక్తం చేశారు. 18 నెలల పాటు జట్టుకు దూరంగా ఉండి, గత నెలలో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు తిరిగి వచ్చిన అజింక్యా రహానేకి టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీని అప్పగించారు.