NTV Telugu Site icon

Donald Trump: “పుతిన్ నన్ను కలవాలనుకుంటున్నారు”.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

Vladimir Putin , Donald Trump

Vladimir Putin , Donald Trump

Donald Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను కలవాలని అనుకుంటున్నారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తమ ఇద్దరి మధ్య సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రంప్ గురువారం తెలిపారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైంది. అయితే, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పుతానని పలుమార్లు ట్రంప్ అన్నారు.

Read Also: INDIA alliance: ఇండియా కూటమి విచ్ఛిన్నం, కాంగ్రెస్‌దే బాధ్యత.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..

ఈ నేపథ్యంలోనే మరి కొన్ని రోజుల్లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ సమయంలోనే పుతిన్‌లో మీటింగ్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పుతిన్ నన్ను కలవాలని అనునకుంటున్నాడు. మేము ఏర్పాట్లు చేస్తున్నాము.’’ అని ట్రంప్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని తన మార్-ఏ-లాగో రిసార్ట్‌లో రిపబ్లికన్ గవర్నర్లతో జరిగిన సమావేశంలో అన్నారు. మనం ఈ యుద్ధాన్ని ముగించాలని వ్యాఖ్యానించాడు.

ట్రంప్ ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య శాంతి, కాల్పుల విరమణ గురించి ప్రత్యేకంగా ఎలాంటి నిర్దిష్ట ప్రణాళికల్ని చెప్పలేదు. అయితే, ఉక్రెయిన్‌కి అమెరికా అందించే భారీ సైనిక సాయాన్ని మాత్రం విమర్శించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీని ‘‘సెల్స్ మ్యాన్’’ అంటూ విమర్శించారు. ఈ యుద్ధంలో బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్‌కి గట్టి మద్దతుదారుగా ఉంది. 2022 నుంచి 65 బిలియన్ డాలర్లకు పైగా విలువైన సైనిక సాయాన్ని అందించింది.

Show comments