Putin: తిరుగుబాటు నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న పుతిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు రష్యా తరుపున పోరాడిని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ ఏకంగా రష్యా ప్రభుత్వం, సైన్యంపైనే తిరుగుబాటు చేసింది. తాము చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే తమ చావు రష్యా ప్రజల కోసమే అంటూ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ అన్నారు. రష్యాలో మిలిటరీ నాయకత్వాన్ని కూలుస్తామని, అధ్యక్షుడు పుతిన్ కే వార్నింగ్ ఇచ్చాడు. అన్యాయంగా తమ సైనికులను రష్యన్ ఆర్మీ చంపేస్తోందని ఆరోపించారు. రష్యా దాడుల్లో తమ సైన్యం వేలల్లో చనిపోతోందని దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
Read Also: Maruti Suzuki WagonR CNG Price: 80 వేలకే మారుతీ వేగనార్ సీఎన్‌జీ.. 34 కిలోమీటర్ల మైలేజ్!
Also Read
ఇదిలా ఉంటే రష్యాలో సాయుధ తిరుగుబాటు నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో బలగాలను పెంచింది. తిరుగుబాటు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. తిరుగుబాటును ఎదుర్కొనేందుకు త్వరలోనే దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యన్ వార్తా సంస్థలకు తెలియజేశారు.
మరోవైపు వాగ్నర్ గ్రూప్ రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లోని పట్టణాలను స్వాధీనం చేసుకునేందుకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే రష్యన్ ఆర్మీకి సంబంధించిన ఒక హెలికాప్టర్‌ని కూల్చేసినట్లు వాగ్నర్ గ్రూప్ వెల్లడించింది. మరోవైపు తిరుగుబాటు ప్రారంభించిన ప్రిగోజిన్‌పై క్రిమినల్ విచారణ ప్రారంభించినట్లు రష్యా ప్రభుత్వం తెలిపింది. మరోవైపు 25000 మంది బలగం తమతో ఉందని, రష్యా ప్రజలు కూడా తమతో చేరాలని, మేం తిరుగుబాటు చేయడం లేదని, న్యాయం కోసం పోరాడుతున్నామని ప్రిగోజిన్ అన్నారు.
ప్రస్తుతం వాగ్నర్ గ్రూప్ రోస్తోవ్ లోని మిలిటరీ కార్యాలయాన్ని ఆధీనంలోకి తసుకుంది. రష్యాలోని దక్షిణ ప్రాంతమైన రోస్తోవ్ లోని మిలిటరీ కార్యాలయం నుంచి ప్రిగోజిన్ ఓ వీడియోను విడుదల చేసి.. చీఫ్ ఆఫ్ స్టాఫ్ గెరాసియోమ్, రక్షణ మంత్రి సెర్గీ సోయిగు తనతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే వాగ్నర్ సేనలు మాస్కో వైపు వెళ్లాయని.. రోస్తోవ్ ను దిగ్బంధం చేస్తాయని హెచ్చరించారు. మరోవైపు గెరాసిమోవ్ మిలిటరీ కార్యాలయం నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!