Vladimir Putin Says They Are Ready For Solved Ukraine Problem Peacefully: ఉక్రెయిన్‌తో తాము కొనసాగిస్తున్న యుద్ధానికి పాశ్చాత దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు తాము సిద్ధంగానే ఉన్నప్పటికీ.. ఆ దేశాలే చర్చలకు సిద్ధంగా లేవని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో.. జాతిని ఉద్దేశించి పుతిన్ ప్రసంగించారు. స్థానిక ఘర్షణను అంతర్జాతీయ ఘర్షణగా మార్చేందుకు పాశ్చాత్త దేశాలు పూనుకున్నాయని.. ఉక్రెయిన్‌కు కూడా ఇరాక్, యుగోస్లావియా గతి పటిస్తారని కుండబద్దలు కొట్టారు.
1 Rupee Controversy: రూపాయి ఇవ్వని కండక్టర్.. కోర్టుకెక్కిన ప్రయాణికుడు.. చివరికి ఏమైందంటే?
పుతిన్ మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు పాశ్చాత్య దేశాలదే బాధ్యత. సమస్యను పరిష్కరించేందుకు మేము సాధ్యమైనన్నీ చర్యలు తీసుకుంటున్నాం. దేశం ఎదుర్కొంటోన్న సవాళ్లను దశలవారీగా క్రమపద్ధతిలో పరిష్కరిస్తాం. కానీ.. మా వెనక అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. నాటో.. రష్యా సరిహద్దు వద్దకు విస్తరించాలని భావించింది. మేము ఇఖ్కడ మా దేశ ఉనికి గురించే మాట్లాడుతున్నాం. మేము సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు సిద్ధంగానే ఉన్నా.. ఆ దేశాలే సిద్ధంగా లేవు. వారి వైఖరితో సమస్య మరింత జఠిలమవుతోంది. ఆ దేశాల యుద్ధం కోసం 150 బిలియన్ల డాలర్లు ఇచ్చాయి. ఉక్రెయిన్‌కు ఇరాక్, యుగోస్లావియా గతి పట్టిస్తారు. కానీ.. మేం ప్రపంచ భద్రత కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు.
KL Rahul: కేఎల్ రాహుల్‌కి మరో బిగ్ షాక్.. స్థానం పోయినట్టే?
ఇదిలావుండగా.. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మొదలై ఏడాది కావస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయి, యుద్ధం గురించి చర్చించారు. ఈ యుద్ధానికి ‘కిరాతకం, అన్యాయమైన యుద్ధం’గా అభివర్ణించారు. మరోవైపు.. అణ్వాయుధ వినియోగంపై పరిమితి విధిస్తూ, అగ్రరాజ్యం అమెరికాతో చేసుకున్న ఒప్పందంలో తన భాగస్వామ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. “అమెరికాతో రష్యా వ్యూహాత్మక ప్రమాదకర ఆయుధాల ఒప్పందంలో తన భాగస్వామ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేను ఈరోజు ప్రకటించవలసి వచ్చింది” అని పుతిన్ తన ప్రసంగంలో చెప్పారు.