Vessel Carrying 400 Migrants Struck In Sea Amid Fuel Shortage: ఉత్తర ఆఫ్రికాలోని మధ్యధరా సముద్ర మార్గంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 400 మంది వలసదారులతో కూడిన ఒక ఓడ.. సముద్రం మధ్యలో చిక్కుకుపోయింది. వీరు లిబియా నుంచి మధ్యదరా సముద్ర మార్గం ద్వారా అక్రమంగా దేశం దాటుతుండగా.. గ్రీస్, మాల్టా మధ్యలో ఈ ఓడ ఆగిపోయింది. ఇందుకు కారణం.. ఇంధనం అయిపోవడం! ఈ విషయాన్ని పసిగట్టిన ఆ ఓడ కెప్టెన్.. ఎవ్వరికీ తెలియకుండా అక్కడి నుంచి చెక్కేశాడు. దీంతో.. ఆ ఓడలో ఉన్న 400 మంది వలసదారుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్న ఆ వలసదారులు.. తమ దుర్భర స్థితి గురించి ‘అలారం ఫోన్’ అనే సపోర్ట్ సర్వీస్‌కు సంప్రదించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే.. ఈ ఓడ గురించిన వివరాలను ట్విటర్ ద్వారా వెల్లడించింది. తాము ఆల్రెడీ అధికారులకు సమాచారం అందించామని కూడా ఆ సంస్థ పేర్కొంది. ఓడ కింది భాగమంతా నీటితో నిండిపోవడం వల్ల.. అందులోని వలసదారులంతా బోటు పై భాగానికి చేరుకున్నారని తెలిపింది. అంతేకాదు.. ప్రస్తుతం ఓ ఓడ గాలికి కొట్టుకుపోతోందని తెలియజేసింది.
Rashid Khan: రషీద్ ఖాన్ వరల్డ్ రికార్డ్.. టీ20లోనే అగ్రస్థానం
ఈ ఓడ సమాచారం అందుకున్న ‘సీ వాచ్ ఇంటర్నేషనల్’ అనే జర్మనీకి చెందిన ఎన్జీవో సంస్థ.. ఆ ఓడ సమీపంలోనే మరో రెండు నౌకలున్నట్టు వెల్లడించింది. అయితే.. ఆ ఓడను రక్షించవద్దని, ఇంధనం మాత్రమే సరఫరా చేయాలని మాల్టా అధికారులు ఆదేశించినట్లు ఆ ఎన్జీవో తెలిపింది. దీనిపై యూరోపియన్ యూనియన్ వెంటనే చర్యలు తీసుకోవాలని, వలసదారుల్ని కాపాడాలని కోరింది. మరోవైపు.. అలారం ఫోన్ సర్వీస్ ట్విటర్‌లో మరో పోస్ట్ పెట్టింది. ఆ ఓడలో ఉన్న వారందరూ తీవ్ర భయాందోళలనలకు గురవుతున్నారని, వారిని వెంటనే రక్షించాలని తాము కోరామని వెల్లడించింది. తాము డిసియోట్టి అనే ఒక ఓడను పంపించామని ఇటాలియన్ కోస్ట్ గార్డ్ పేర్కొందని.. ఇది త్వరగా ఆ ప్రాంతానికి చేరుకొని, అందులో ఉన్న వలసదారుల్ని రక్షిస్తుందని ఆశిస్తున్నామని తెలిపింది. కాగా.. గతంలో ఇదే తరహాలో ఆఫ్రికా నుంచి ఇటలీకి కొందరు వలస వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే.. వారు ప్రయాణిస్తున్న రెండో ఓడలు ట్యునీషియా సమీపంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో 22 మంది మరణించగా, నలుగురు గల్లంతయ్యారు. 11 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి.. 440 మంది వలసదారుల్ని అధికారులు కాపాడగలిగారు.
Amit Shah: చైనాకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్.. ఒక్క అంగుళం కూడా తీసుకోలేరు