NTV Telugu Site icon

USA: హౌతీ రెబల్స్పై అమెరికా దాడులు..

Houthis

Houthis

USA: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిపోయాయి. ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య పోరు క్రమంగా కొనసాగుతుంది. శనివారం హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌అవీవ్‌పై క్షిపణులతో దాడి చేసింది. అయితే, దీనికి అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. యెమెన్‌ రాజధానిలో ఉన్న హౌతీల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు అగ్రరాజ్యం వెల్లడించింది. హౌతీ తిరుగుబాటుదారుల కార్యకలపాలు దెబ్బతినేలా ఈ దాడులు కొనసాగించినట్లు పేర్కొనింది. ఎర్ర సముద్రం, బాబ్‌ అల్‌ మాండెబ్‌, ఏడెన్ గల్ఫ్‌లో వ్యాపార నౌకలపై దాడులు చేసినట్లు యూఎస్ తెలిపింది. దీంతో హౌతీల కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే తమ లక్ష్యమని అమెరికా మిలిటరీ అధికారులు వెల్లడించారు.

Read Also: Sanjay Raut: బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం.. మహా వికాస్‌ అఘాడీలో లుకలుకలు

ఇక, మరోవైపు గత గురువారం యెమెన్‌పై ఇజ్రాయెల్‌ డిఫెన్స్ పోర్స్ దాడులు చేసింది. ఈ దాడులు హౌతీ రెబల్స్ సైనిక స్థావరాల లక్ష్యంగా జరిపాయి. దీనికి ప్రతీకారంగా శనివారం ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌అవీవ్‌పై ప్రొజక్టైల్‌ క్షిపణులను హౌతీలు ప్రయోగించాయి. వీటిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్‌ సైన్యం ఫెయిల్ అయింది. దీంతో 16 మంది గాయాపడ్డారు. టెల్‌అవీవ్‌పై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేసిన కొన్ని గంటల్లోనే అమెరికా ప్రతీకార చర్యలకు దిగింది.

Show comments