NTV Telugu Site icon

Pannun murder plot: ఖలిస్తాన్ పన్నూ హత్య కుట్రలో భారత్ దర్యాప్తుపై అమెరికా ఎదురుచూపు..

Pannun

Pannun

Pannun murder plot: ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసులో అమెరికా, భారత దర్యాప్తు కోసం ఎదురుచూస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్ సోమవారం అన్నారు. ఈ హత్య కుట్ర కేసులో భారత ప్రభుత్వ ఉద్యోగి ప్రమేయం ఉందని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికన్ సిటిజన్ అయిన పన్నూను హతమార్చేందుకు నిఖిల్ గుప్తా అనే వ్యక్తి ఒక భారతీయ అధికారి తరుపున ప్లాన్ చేశాడని ఆరోపించింది. ప్రస్తుతం నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్నాడు. ఇతడిని తమకు అప్పగించాలని అమెరికా కోరుతోంది. మరోవైపు నిఖిల్ గుప్తాను అప్పటించే విషయంలో చెక్ రిపబ్లిక్ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.

Read Also: Swathi: కలర్స్ స్వాతిని ‘ఛీ.. నీ బతుకు.. ‘ అంటూ మెసేజ్.. రిప్లై గట్టిగా ఇచ్చిందిగా..

ఇటీవల వాషింగ్టన్ పోస్ట్.. అమెరికా గడ్డపై పన్నూను చంపేందుకు కుట్ర పన్నిన కేసులో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) అధికారి ప్రమేయం ఉన్నట్లు ఓ కథనాన్ని ప్రచురించింది. పన్నూని చంపేందుకు రా అధికారి ఒక హిట్ టీమ్‌ని నియమించినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ఆరోపించింది. ఈ నివేదికను భారత్ తీవ్రంగా తిరస్కరించింది. ఇది అసమర్థమైన, నిరాధారమైన ఆరోపణలని చెప్పింది. ఈ కేసుపై భారత్ దర్యాప్తు చేస్తుందని చెప్పింది. అమెరికన్ పౌరసత్వం కలిగిన పన్నూను అమెరికా గడ్డపైనే చంపేందుకు కుట్ర పన్నిన కేసును ఆ దేశం తీవ్రంగా పరిగణిస్తోంది. అయితే, అమెరికా ఆరోపణలపై భారత్ అత్యున్నత విచారణ కమిటి ఏర్పాటు చేసి విచారిస్తోంది.

Show comments