Site icon NTV Telugu

US Visa Policy: అమెరికా కొత్త మెలికతో విద్యార్థులకు షాక్.. భారతీయుల గుండెల్లో గుబులు

Us

Us

US Visa Policy: అగ్రరాజ్యం అమెరికాలో తాజా వీసా ప్రతిపాదన భారతీయ విద్యార్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న స్థిరమైన డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ (Duration of Status) విధానాన్ని రద్దు చేసి, ప్రతీ స్టూడెంట్ వీసాకు స్పష్టమైన గడువును విధించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెడీ అయ్యాడు. ఈ ప్రతిపాదన ప్రకారం, ప్రతీ విదేశీ విద్యార్థి దేశం విడిచే ఖచ్చితమైన తుది తేదీని నిర్ణయించనున్నారు. ఇది ముఖ్యంగా వలసలను అడ్డుకునేందుకు తీసుకొచ్చిన కఠినమైన చర్యగా పేర్కొన్నారు. ఈ మార్పులు F-1 ( స్టూడెంట్స్), J-1 (పర్యటకుల) వీసాలపై యూఎస్ లో ఉన్న లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.

Read Also: CM Revanth Reddy: ప‌దో త‌ర‌గతి ఉత్తీర్ణులైన ప్ర‌తి విద్యార్థి ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేయాలి..!

అయితే, డొనాల్డ్ ట్రంప్ 2020లో తన మొదటి పదవీకాలంలో ఈ కొత్త వీసా నియమాన్ని తొలిసారి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) సిద్ధం చేసింది. ఇది కేవలం విదేశీ విద్యార్థులకే కాదు.. J-1 వీసా హోల్డర్లు, విదేశీ మీడియా ప్రతినిధులపై కూడా ప్రభావం చూపించనుంది. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో, విద్యార్థులు తమ చదువును కొనసాగుతున్నంత వరకు అమెరికాలో ఉండేందుకు పర్మిషన్ ఉంటుంది. ఈ ప్రతిపాదన అమలైతే వారికి ఒక నిర్దిష్ట గడువు కేటాయించబడుతుంది. ఆ టైంలోపే అమెరికా వదిలిపెట్టాల్సి ఉంటుంది. అంటే, డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ (D/S) సదుపాయాన్ని రద్దు చేస్తారు. ఇక, ఈ ప్రతిపాదిత నియమాన్ని సమీక్ష కోసం మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ కార్యాలయానికి సమర్పించారని తెలుస్తుంది. ప్రజల అభిప్రాయం కోసం 30 నుంచి 60 రోజుల గడువు ఇచ్చే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో దీన్ని అమలులోకి తీసుకురావచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Read Also: Shirish Reddy: నేను మూర్ఖుడిని కాదు .. చరణ్ గారితో సినిమా తీయబోతున్నాం!

ఇక, ఈ నియమాన్ని ఉన్నత విద్యా సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్టూడెంట్స్ చదువుకు ఇది తీవ్ర అంతరాయం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న 3.3 లక్షలకు మందికి పైగా విద్యార్థులపై దీని ఎఫెక్ట్ పడనుండగా.. ఇందులో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రతిపాదనతో తీవ్రంగా భారతీయ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.

Exit mobile version