పాకిస్థాన్‌తో అమెరికాకు వాణిజ్య డీల్ కుదిరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. భవిష్యత్‌లో భారత్‌కు పాకిస్థాన్ చమురు కూడా విక్రయించొచ్చని తెలిపారు. ఇక భారత్‌పై 25 శాతం సుంకం విధించినట్లు వెల్లడించారు. ఆగస్టు 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. భారత్ మంచి స్నేహితుడు అని చెబుతూనే ట్రంప్ సుంకం విధించారు.
ఇది కూడా చదవండి: Mahabubabad: ఇంట్లో నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలుడిపై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు
పాకిస్థాన్‌తో జరిగిన ట్రేడ్ డీల్స్ గురించి ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా చమురు నిల్వలను పెంచుకోవడంలో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. ఒక మంచి చమురు కంపెనీని ఎంచుకునే ప్రక్రియలో కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఇక భవిష్యత్తులో భారత్‌కు పాక్ చమురు విక్రయించొచ్చు అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Extra Marital Affairs: మీరు మారరా.. భర్త హత్యకు లక్ష సుపారీ.. ఇలా దొరికిపోయిన భార్య
అమెరికాతో భారత్ ఐదు రౌండ్ల వాణిజ్య చర్చలు జరిపింది. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. ఇంకోవైపు ట్రంప్ విధించిన డెడ్‌లైన్ ముగిసింది. దీంతో శుక్రవారం నుంచి భారత్‌పై 25 శాతం సుంకం విధిస్తు్న్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే అదనంగా పెనాల్టీలు కూడా ఉంటాయని హెచ్చరించారు. పాడి పరిశ్రమ, వ్యవసాయంపై అమెరికా మినహాయిపులు కోరుతోంది. అయితే భారతీయులకు ఈ రెండు సెంటిమెంట్. ఆ కారణం చేతనే చర్చలు కొలిక్కి రాలేదు. ఇక తాజాగా ట్రంప్ విధించిన సుంకాలను పరిశీలిస్తున్నట్లు భారత్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్ మంచి మనసు.. 222 కుటుంబాలకు రగ్గుల పంపిణి!
