Site icon NTV Telugu

OperationSindhoor: పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్..

Marc

Marc

Operation Sindhoor: పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో కాల్పులకు దిగింది. దీంతో పాటు నియంత్రణ రేఖ ప్రాంతంలోని భారతదేశంలోని 26 ప్రదేశాలలో సాయుధ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. పాక్ కాల్పులు, డ్రోన్ దాడులను భారత బలగాలు తిప్పికొట్టాయి. దీంతో భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.

Read Also: Pakistan : పరేషాన్‌లో పాకిస్తాన్‌… 48 గంటల పాటు పెట్రోల్ బంక్‌లు బంద్‌..

భారత్- పాకిస్తాన్ మధ్య పరస్పర దాడులపై ఆమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా భారత్‌తో పెరిగిన ఉద్రిక్తతను తగ్గించుకోవాలని కోరినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇరు దేశాలు ఘర్షణలను నివారించడానికి “నిర్మాణాత్మక” చర్చలను ప్రారంభించడానికి అమెరికా సహాయం చేస్తుందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే మార్క్ రూబియో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో విడివిడిగా మాట్లాడారు. రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అలాగే, ఉగ్రవాద గ్రూపులకు మద్దతును అంతం చేయడానికి పాకిస్తాన్ ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి రుబియో పిలుపునిచ్చారు.

Exit mobile version