Trump-Mexico: ట్రంప్ మరో దూకుడు.. మెక్సికోపై దాడి చేయబోతున్నట్లు ప్రకటన
- ట్రంప్ మరో దూకుడు
- మెక్సికోపై దాడి చేయబోతున్నట్లు ప్రకటన
- ఇటీవలే వెనిజులాపై దాడి చేసిన అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ అన్నట్టుగానే మరొక దేశంపై సైనిక దాడి ప్రారంభించారు. తాజాగా మెక్సికోపై దాడి చేస్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. మెక్సికోలో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ‘‘మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభిస్తున్నాం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు మెక్సికోను పరిపాలిస్తున్నారు. ఆ దేశ స్థితిని చూస్తుంటే చాలా బాధకరంగా ఉంది. ఏం చేస్తాం. మాదక ద్రవ్యాల రవాణాదారులు పాలిస్తున్నారు. వారి కారణంగా అమెరికాలో 300,000 మంది చనిపోతున్నారు.’’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Trump-Greenland: ట్రంప్‌కు డెన్మార్క్ వార్నింగ్.. గ్రీన్‌ల్యాండ్ స్వాధీనం చేసుకుంటే..!
Also Read
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్‌పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
అంతకముందు గురువారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. సముద్ర మార్గాల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అమెరికా పెద్ద విజయం సాధించిందని.. ఇప్పుడు భూ మార్గాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. సముద్రం ద్వారా వచ్చే మాదక ద్రవ్యాలను దాదాపు 97 శాతం కంట్రోల్ చేశామని.. ఇప్పుడు డ్రగ్స్ కార్టెలపై భూ దాడులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. మెక్సికోను మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులే పాలిస్తున్నారని.. ఇది చాలా విచారకరమని.. ఆ దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Trump: ఆమె ప్రవర్తన దారుణంగా ఉంది.. ఇమ్మిగ్రేషన్ అధికారిని సమర్థించిన ట్రంప్
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్.. అమెరికా సైనిక చర్యను ఖండించిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. షీన్బామ్ మాట్లాడుతూ.. మెక్సికో భద్రతా విషయంలో అమెరికాకు సహకరిస్తామని చెప్పారు. అయితే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా పోరాటంలో అంతర్జాతీయంగా సహకారం చాలా అవసరం అని.. అయితే ఈ సహకారం పరస్పర గౌరవం, సమానత్వంపై ఆధారపడి ఉండాలని స్పష్టం చేశారు. మెక్సికోను ప్రజలే పాలిస్తున్నారని తెలిపారు. ఏదో సాకుతో మెక్సికోను స్వాధీనం చేసుకుంటామంటే అమెరికా జోక్యాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి విదేశీ సైనిక జోక్యాన్ని అంగీకరించబోమని షీన్బామ్ వ్యాఖ్యానించారు.
గత శనివారం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకొచ్చింది. ఆ సమయంలోనే త్వరలోనే కొలంబియా, మెక్సికో, క్యూబా దేశాలపై దాడులు చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా మెక్సికోపై దాడి చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్‌శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్‌లో అలియాను పట్టించుకోలేదా..?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!