NTV Telugu Site icon

Israel-Hamas War: హమాస్‌ ఫైనాన్షియర్లపై అమెరికా ఉక్కపాదం.. ఖతార్, టర్కీ, గాజాలో పలువురిపై ఆంక్షలు..

Hamas

Hamas

Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్ పై జరిగిన దాడుల్లో 1400 మంది చనిపోయారు. పిల్లలు, మహిళలు అనే తేడా లేకుండా దొరికినవాళ్లను దొరికినట్లు కాల్చి చంపారు. ఉగ్రవాదులు 200 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్, గాజా స్ట్రిప్ పై భీకరదాడులు జరుపుతోంది. ఈ దాడుల్లో 3000 మంది మరణించారు.

Read Also: Pakistan: ఇంధనానికి కూడా డబ్బులు లేవు.. 48 విమానాలను రద్దు చేసిన పీఐఏ

ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయిల్‌కి బలమైన మద్దతు ఇస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా హమాస్‌కి నిధులు ఇస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది అమెరికా. హమాస్ నిధులకు అడ్డుకట్ట వేసేలా బుధవారం ఆంక్షలు జారీ చేసింది. హమాస్ రహస్య పెట్టుబడులు, ఇరాన్ తో ముడిపడి ఉన్న ఫైనాన్షియర్ ఫెసిలిటేలర్లు, గాజాలో వర్చువల్ కరెన్సీ మార్పిడి వంటి వాటిని అమెరికా లక్ష్యం చేసుకుంది.

తీవ్రవాద సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం.. గాజాలోని 9 మంది వ్యక్తులు, ఒక సంస్థతో సహా సుడాన్, టర్కీ, అల్జీరియ, ఖతార్ సహా ఇతర ప్రాంతాలను అమెరికాను లక్ష్యంగా చేసుకున్నట్లు యూఎస్ ట్రెజరీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పిల్లలను, ఇజ్రాయిలీ పౌరులను క్రూరంగా చంపిన హమాస్ ఫైనాన్షియర్లను లక్ష్యంగా చేసుకోవడానికి యూఎస్ఏ వేగంగా, నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకుందని ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ అన్నారు.