Iran -Israel : ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడి
- ఇరాన్‌లో మూడు అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు
- "ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్" లక్ష్యంగా బాంబింగ్
- ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు
Iran -Israel : ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా విజయవంతంగా వైమానిక దాడులు నిర్వహించిందని మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. “ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్” అనే కీలక అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని శనివారం ఆయన “ట్రూత్ సోషల్” వేదికగా తెలిపారు. “ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై మేం చేసిన దాడి పూర్తి విజయవంతంగా ముగిసింది. మా బాంబర్లు ఫోర్డోపై పూర్తి స్థాయిలో పేలోడ్‌తో దాడి చేశాయి. ప్రస్తుతం మా విమానాలన్నీ ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చాయి. సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకున్నాయి. ఈ సాహసోపేత ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన మా వీర సైనికులకు హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి ఆపరేషన్‌ను ప్రపంచంలో మరే దేశ సైన్యం కూడా చేయలేదని గర్వంగా చెబుతున్నాను.
Also Read
- Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
- Condom Prices: బెడ్‌రూమ్‌లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
- Brazilian Athlete: స్విమ్ రేస్ లో ప్రముఖ బ్రెజిలియన్ అథ్లెట్ మృతి..
- Hormuz Attack: హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్.. మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ కాల్పులు.. తృటిలో తప్పిన ప్రమాదం!
ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందని నమ్ముతున్నాను,” అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయవంతమైన ఆపరేషన్ గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు శనివారం రాత్రి 10:00 గంటలకు వైట్‌హౌస్ నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. “ఇది అమెరికా, ఇజ్రాయెల్ ప్రపంచానికి చారిత్రక ఘట్టం. ఇరాన్ ఇప్పుడు ఈ ఘర్షణకు ముగింపు పలకాలి. ధన్యవాదాలు!” అని మరో సందేశంలో ఆయన పేర్కొన్నారు.
ఇకపోతే, గత వారం ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలు అణు కేంద్రాలు, సీనియర్ నేతలు లక్ష్యంగా మారిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అనేక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. డజన్ల కొద్దీ ఇరానియన్ సైనికులు, అణు శాస్త్రవేత్తలు మరణించారు. ప్రతిగా, ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో ప్రతిఘాతం తెలిపింది. ఈ ఉద్రిక్త వాతావరణంలో అమెరికా తాజా దాడులు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంతేకాదు, ఇరాన్‌తో చర్చలు ప్రారంభించేందుకు గరిష్టంగా రెండు వారాల సమయం ఇస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు.
Murugan Devotees Meet: నేడు మధురైలో మురుగన్ భక్తుల సమ్మేళనం.. హాజరుకానున్న యోగి, పవన్ !
తాజావార్తలు
-
Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?