NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్‌కి బాలిస్టిక్ మిస్సైల్ టెక్నాలజీ అందించిన చైనా.. 3 కంపెనీలపై యూఎస్ నిషేధం..

Pakistan

Pakistan

Pakistan: చైనా తన ఆప్తమిత్రుడు పాకిస్తాన్ కోసం కావాల్సిన అన్ని సాయాలు చేస్తోంది. భారత్‌ని ఇరుకున పెట్టేందుకు పాకిస్తాన్‌కి అన్ని విధాల సహాయపడుతోంది. తాజాగా చైనాకు చెందిన కొన్ని కంపెనీలు పాకిస్తాన్‌కి బాలిస్టిక్ మిస్సైల్ కార్యక్రమానికి సంబంధించి కీలక వస్తువులు, సాంకేతికతను సరఫరా చేసింది. దీనిపై ఆగ్రహించిన అమెరికా, చైనాలోని మూడు కంపెనీలపై ఆంక్షలు విధించింది. గ్లోబల్ నాన్‌ప్రొలిఫరేషన్ రిజిమ్‌లో భాగంగా ఈ మూడు కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ శుక్రవారం తెలిపింది.

పాకిస్తాన్‌కి అతిపెద్ద ఆయుధ విక్రయదారుగా చైనా ఉంది. ఇస్లామాబాద్ సైనిక ఆధునీకరణ కార్యక్రమానికి ప్రధాన ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాల సరఫరాదారుగా ఉంది. ప్రస్తుతం చైనాకు చెందిన జనరల్ టెక్నాలజీ లిమిటెడ్, బీజింగ్ లువో లువో టెక్నాలజీ డెవలప్‌మెంట్ కో లిమిటెడ్, మరియు చాంగ్‌జౌ ఉటెక్ కాంపోజిట్ కంపెనీ లిమిటెడ్‌లపై అమెరికా ఆంక్షలు విధించింది.

Read Also: NEET: నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో డీఎంకే సంతకాల ప్రచారం..

జనరల్ టెక్నాలజీ లిమిటెడ్ బాలిస్టిక్ మిస్సైల్ రాకెట్ ఇంజిన్ లోని భాగాలను కలపడానికి, కంబర్షన్ చాంబర్ ఉత్పత్తిలో బ్రేకింగ్ పదార్థాలను సరఫరా చేయడానికి పనిచేసింది. లువో లువో టెక్నాలజీ డెవలప్మెంట్ కో లిమిటెడ్ మాండ్రెల్స్, ఇతర యంత్రాల సరఫరాకు తోడ్పడింది. వీటిని సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటార్ ల ఉత్పత్తిలో ఉపయోగించవచ్చు. చాంగ్‌జౌలోని ఉటెక్ కంపెనీ డీ-గ్లాస్ ఫైబర్, క్వార్ట్జ్, ఫాబ్రిక్, హై సిలికా క్లాత్ ని సరఫరా చేసింది. వీటన్నింటిని క్షిపణి వ్యవస్థలో వాడుతారు.

సామూహిక విధ్వంసం చేసే ఆయుధాల విస్తరణ, వాటి పంపిణీ సాధానాలు, దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ జరిగినా, వాటికి వ్యతిరేకంగా అమెరికా చర్యలు తీసుకుంటుందని విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. పాకిస్తాన్ తన అబాబీల్ క్షిపణి వ్యవస్థను ప్రయోగించిన కొద్ది రోజులకే ఈ ఆంక్షలు వచ్చాయి.