US React PM Modi Russia Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యా పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా రియాక్ట్ అయింది. ఈ విషయమై యూఎస్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు.. రష్యాతో మైత్రి కొనసాగింపుపైనా తమ ఆందోళనలను ఎప్పటికప్పుడు భారతదేశానికి తెలియజేస్తున్నామన్నారు. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఏం మాట్లాడతారో వేచి చూడాలి అని చెప్పారు.
Read Also: Rat in Chutney: సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజీ క్యాంపస్ లో చట్నీలో ఎలుక..
అలాగే, భారత్ తమకు ఒక వ్యూహాత్మక భాగస్వామి అని అగ్రరాజ్య అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చెప్పుకొచ్చారు. వివిధ అంశాలపై నిరంతరం సమగ్ర, స్పష్టమైన చర్చలతో రెండు దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలి అని మోడీని కోరారు. రష్యా తీసుకునే ఏ నిర్ణయమైనా, ఉక్రెయిన్ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వం, ఐరాస చట్టాలను గౌరవించేలా ఉండాలని పుతిన్‌కు క్లియర్ గా చెప్పాలి అని అమెరిక విదేశాంగ ప్రతినిధి మథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. రష్యాతో సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్నైనా తాము ఇదే కోరతామని వెల్లడించారు. కాగా, 2022లో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాకు దూరంగా ఉండాలని భారత్‌పై అమెరికా బాగా ఒత్తిడి చేస్తుంది. అయితే కొన్ని ఆర్థిక అవసరాల దృష్ట్యా రష్యాతో భారత్ సత్సంబంధాలను ఇప్పటికి కొనసాగిస్తోంది.