హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చినప్పటి నుంచి మంచి విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉంది. హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తూ వస్తోంది. ఇటివల తారక్ కి జోడిగా ‘దేవర’ మూవీ ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ప్రస్తుతం.. రాంచరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక మూవీస్ తో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జాన్వీ..ఆమె అందాల ఆరబోత ఎలా ఉంటుందనేది కొత్తగా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే తాజాగా జాన్వీ ఓ క్రేజీ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినపడుతున్నాయి…
Also Read:Pradeep Ranganathan: హీరోగా నన్ను చాలా మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు..
‘కబాలి’, ‘కాలా’,‘తంగలాన్’ వంటి సినిమాలు తీసిన కోలివుడ్ దర్శకుడు పా రంజిత్ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ దర్శకుడు ఇటీవల ‘బ్యాడ్ గర్ల్’ సినిమా విషయంలో ఒక కాంట్రవర్సీలో హైలైట్ అయ్యాడు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ఏంటీ జాన్వీ, రంజిత్ దర్శకత్వంలో ఒక మూవీ కి సిద్ధం అయిందట.అది కూడా వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో, ఓ భారీ వెబ్ సిరీస్ కోసం వీరిద్దరు కలిసి పని చేస్తారని తెలుస్తోంది.సో ఇదే జాన్వీ కపూర్‌కి తమిళ డెబ్యూ కూడా అని చెప్పవచ్చు. కానీ ఎప్పుడు బోల్డ్ ట్రీట్ ఇచ్చే జాన్వీ, హాట్ షోస్ కి పూర్తి భిన్నంగా సినిమాలు చేసే పా రంజిత్ తో చేతులు కలపడం అనేది ఒక ఊహించని కలయికగా అని చెప్పాలి. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.