NTV Telugu Site icon

Trump-Modi: మోడీపై ట్రంప్ ప్రశంసలు.. తెలివైన వ్యక్తి అంటూ కితాబు

Trumpmodi

Trumpmodi

భారత ప్రధాని మోడీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా వాణిజ్య సుంకాలపై చర్చలు జరిగాయి. అయితే శుక్రవారం ఇదే అంశంపై ట్రంప్‌ను విలేకర్లు ప్రశ్నంచగా. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని తెలిపారు. ఇక ఈ సందర్భంగా ప్రధాని మోడీని ట్రంప్ ప్రశంసించారు. మోడీ తెలివైన వ్యక్తి అంటూ కితాబు ఇచ్చారు. మోడీ మంచి స్నేహితుడని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Vikram : ప్రేక్షకులకు క్షమాపన చెప్పిన ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ నిర్మాత

‘‘ప్రధాని మోడీ ఇటీవలే అమెరికాకు వచ్చారు. మేము ఎల్లప్పుడూ చాలా మంచి స్నేహితులం. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకటి. ఇది క్రూరమైనది. ఆయన (మోడీ) చాలా తెలివైన వ్యక్తి. నాకు చాలా మంచి స్నేహితుడు. మేము చాలా మంచి చర్చలు జరిపాము. తమతో భారతదేశం చాలా బాగా పని చేస్తుందని నేను భావిస్తున్నాను. అయితే ఏప్రిల్‌ 2న వారు మన దిగుమతులపై ఎంత సుంకాలు వసూలు చేస్తే .. నేను వారి నుంచి అంతే వసూలు చేస్తా’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Betting App Case : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ విష్ణుప్రియ